దేవుని వాక్యంలో ఉన్న సంపద
మీరు ముందూ-వెనుకా ఆలోచించకుండా ప్రవర్తిస్తారా?
దావీదు అడిగిన సహాయం న్యాయమైనదే, కానీ నాబాలు దావీదును, ఆయన మనుషుల్ని అవమానించాడు (1స 25:7-11; ia 89వ పేజీ, 10-12 పేరాలు)
దావీదు ఆవేశంలో నాబాలు ఇంటివాళ్లందర్నీ చంపేయాలనుకున్నాడు (1స 25:13, 21, 22)
దావీదు మీదకు రక్తాపరాధం రాకుండా అబీగయీలు ఆయన్ని ఆపింది (1స 25:25, 26, 32, 33; ia 92వ పేజీ, 18వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను కోపంగా ఉన్నప్పుడు, షాపింగ్ చేస్తున్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు ముందూ-వెనుకా ఆలోచించకుండా ప్రవర్తిస్తానా? లేదా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానా?’—సామె 15:28; 22:3.