మన క్రైస్తవ జీవితం
క్షేత్రసేవా కూటాలను అందరికి ఉపయోగపడేలా ఎలా చేయవచ్చు?
అన్ని సంఘ కూటాల్లాగే, మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపించుకునేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి క్షేత్రసేవా కూటాలను యెహోవా ఏర్పాటు చేశాడు. (హెబ్రీ 10:24, 25) ప్రచారకులు ఎవరెవరితో పనిచేయాలో చెప్పడం, క్షేత్రాన్ని ఇవ్వడం, ప్రార్థన చేయడంతో సహా క్షేత్రసేవా కూటం ఐదు నుండి ఏడు నిమిషాలు జరగాలి. (ఒకవేళ అది సంఘ కూటాల తర్వాత జరుగుతుంటే, అంతకన్నా తక్కువ సమయంలోనే దాన్ని ముగించాలి.) ఆ రోజు పరిచర్యలో పాల్గొనేవాళ్లకు ఉపయోగపడే ఒక విషయాన్ని నిర్వాహకుడు సిద్ధపడాలి. ఉదాహరణకు, శనివారం క్షేత్రసేవా కూటానికి వచ్చే చాలామంది ఆ వారమంతా పరిచర్యలో పాల్గొనివుండరు కాబట్టి, పరిచర్యలో ఏం మాట్లాడాలో చెప్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏ ఇతర అంశాల గురించి ఆ కూటంలో చర్చించవచ్చు?
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్‌లో “ఇలా మాట్లాడవచ్చు” కిందున్న ఏదైనా అందింపు గురించి చెప్పవచ్చు
ప్రస్తుత సంఘటనల్లో ఒకదాన్ని లేదా వార్తల్లో వచ్చిన ఒక విషయాన్ని ఉపయోగించి ఎలా సంభాషణ మొదలుపెట్టాలో చెప్పవచ్చు
సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వాలో చెప్పవచ్చు
దేవుడు లేడనే వాళ్లతో, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లతో, వేరే భాష మాట్లాడేవాళ్లతో, మీ క్షేత్రంలో ఎప్పుడోగానీ కలవని వేరే మతస్థులతో ఎలా మాట్లాడాలో చర్చించవచ్చు
jw.org వెబ్‌సైట్‌ను, JW లైబ్రరీ యాప్‌ను, బైబిల్ని ఎలా ఉపయోగించాలో ఒక విషయం నేర్పించవచ్చు
బోధనా పనిముట్లలో ఒక పనిముట్టును ఎలా ఉపయోగించాలో చెప్పవచ్చు
టెలిఫోన్ సాక్ష్యం, ఉత్తరాల ద్వారా సాక్ష్యం, బహిరంగ సాక్ష్యం, పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు వంటివాటిలో ఏదైనా ఒక దానిని ఎలా చేయాలో చెప్పవచ్చు
భద్రత, పరిస్థితులకు తగ్గట్టు ఉండడం, మంచి ప్రవర్తన, సానుకూలంగా ఉండడం వంటివాటి గురించి గుర్తుచేయవచ్చు
చక్కగా చదువుదాం, బోధిద్దాం బ్రోషురులో ఉన్న ఒక పాఠాన్ని చర్చించవచ్చు లేదా వీడియోని చూపించవచ్చు
తమతోపాటు పరిచర్య చేసే సహోదరుణ్ణి లేదా సహోదరిని ఎలా ప్రోత్సహించవచ్చో, వాళ్లకెలా సహాయం చేయవచ్చో చెప్పవచ్చు
పరిచర్యకు సంబంధించిన ఒక లేఖనం లేదా క్షేత్రంలో ఎదురైన ప్రోత్సాహానిచ్చే ఒక అనుభవం చెప్పవచ్చు