మన క్రైస్తవ జీవితం
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పనిముట్టును మీ పరిచర్యలో ఉపయోగించండి
బైబిలు అధ్యయనాలు చేయడానికి ఒక కొత్త బ్రోషురు అలాగే పుస్తకం అందుబాటులోకి వచ్చినందుకు మనకెంత సంతోషంగా ఉందో కదా! ఎక్కువమందిని శిష్యులుగా తయారుచేయడానికి మనం చేసే కృషిని ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థిద్దాం. (మత్త 28:18-20; 1కొ 3:6-9) ఈ కొత్త పనిముట్లను మనం ఎలా ఉపయోగిస్తాం?
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి అనే పనిముట్టును ఉపయోగిస్తున్నప్పుడు కొత్త పద్ధతిలో బోధిస్తాం కాబట్టి, బైబిలు అధ్యయనాల కోసం సిద్ధపడడానికి అలాగే వాటిని చేయడానికి ఈ నిర్దేశాలను పాటించండి.a
సమాచారాన్ని చదవండి, ఆ తర్వాత ప్రశ్నల్ని చర్చించండి
“చదవండి” అని ఉన్న లేఖనాల్ని చదివాక, వాటిని ఎలా అన్వయించుకోవచ్చో అర్థం చేసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయండి
వీడియోలను చూపించండి, ఆ తర్వాత అక్కడ ఇచ్చిన ప్రశ్నల్ని చర్చించండి
పాఠం మొత్తాన్ని ఒకేసారి పూర్తి చేయడానికి ప్రయత్నించండి
పరిచర్యలో, ఒక వ్యక్తికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి ముందు బ్రోషురును ఇవ్వండి. (“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురును మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఇవ్వవచ్చు?” అనే బాక్సు చూడండి.) బ్రోషురు నుండి స్టడీ పూర్తి అయిపోయి విద్యార్థి ఇంకా నేర్చుకోవాలని అనుకుంటే ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఇచ్చి 4వ పాఠం నుండి స్టడీ మొదలుపెట్టండి. ఒకవేళ మీరు ఇప్పటికే, మనం నేర్చుకోవచ్చు లేదా దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి పుస్తకాల నుండి స్టడీ చేస్తుంటే, వాటిని ఆపి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ఎక్కడ నుండి మొదలుపెట్టాలో మీరే నిర్ణయించుకోండి.
బైబిలు స్టడీకి స్వాగతం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
ఈ కొత్త పుస్తకం నుండి విద్యార్థులు ఏం నేర్చుకుంటారు?
ఈ వీడియోను కొత్త విద్యార్థులకు ఎందుకు చూపించాలి?
స్టడీ కొనసాగుతుండగా విద్యార్థి ఏ లక్ష్యాలు పెట్టుకొని చేరుకునేలా మీరు ప్రోత్సహించాలి?—“ప్రతీ సెక్షన్‌కు సంబంధించిన ముఖ్యాంశం, లక్ష్యాలు” అనే చార్టు చూడండి
a గమనిక: స్టడీ జరుగుతున్నప్పుడు “ఇవి కూడా చూడండి” అనే సెక్షన్‌ను చర్చించాలో వద్దో మీరే నిర్ణయించుకోవచ్చు. అయితే పాఠాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఆ సెక్షన్‌లో ఉన్నవన్నీ చదవండి లేదా చూడండి. అప్పుడు మీ విద్యార్థికి ఏది అవసరమో, ఏది సహాయపడుతుందో మీకు తెలుస్తుంది. ఈ పుస్తకం ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో వీడియోలకు, అదనపు సమాచారానికి సంబంధించిన లింకులు ఉంటాయి.
ప్రతీ సెక్షన్‌కు సంబంధించిన ముఖ్యాంశం, లక్ష్యాలు |
|||
|---|---|---|---|
పాఠాలు |
ముఖ్యాంశం |
విద్యార్థి కోసం లక్ష్యాలు |
|
01-12 |
బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుందో, దాన్ని రాయించిన దేవుణ్ణి మీరు ఎలా తెలుసుకోవచ్చో చూడండి |
బైబిలు చదవమని, స్టడీకి సిద్ధపడమని అలాగే మీటింగ్స్‌కు రమ్మని విద్యార్థిని ప్రోత్సహించండి |
|
13-33 |
దేవుడు మనకోసం ఏం చేశాడో, మనం ఎలా ఆరాధిస్తే ఆయనకు నచ్చుతుందో చూడండి |
సత్యాన్ని ఇతరులతో పంచుకోమని, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అవ్వమని విద్యార్థిని పురికొల్పండి |
|
34-47 |
తనను ఆరాధించేవాళ్లు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూడండి |
తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకునేలా విద్యార్థిని పురికొల్పండి |
|
48-60 |
దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండవచ్చో తెలుసుకోండి |
విద్యార్థి తప్పొప్పులను తెలుసుకునేలా, దేవునికి దగ్గరయ్యేలా బోధించండి |
|