కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 9
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 9

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి

దేవునికి లోబడాలనే కోరిక హృదయంలో నుండి రావాలి. (సామె 3:1) కాబట్టి మనం చెప్పే విషయాలు వినేవాళ్ల హృదయాలను చేరుకునేలా బోధించాలి. అదెలా చేయవచ్చు?

మీ విద్యార్థికి బైబిలు సత్యాలు బోధించడమే కాదు. నేర్చుకున్న విషయాలు వాళ్ల జీవితాలను ఎలా మెరుగుపర్చగలవో, యెహోవాతో ఉన్న సంబంధాన్ని ఎలా బలపర్చగలవో అర్థం చేసుకునేలా సహాయం చేయండి. బైబిలు ప్రమాణాలు దేవుని ప్రేమను, మంచితనాన్ని, నీతిని ఎలా వివరిస్తాయో కూడా గ్రహించేలా సహాయం చేయండి. నేర్చుకుంటున్న విషయాలపై వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడానికి నేర్పుగా, గౌరవపూర్వకంగా ప్రశ్నలు వేయండి. ఏదైనా చెడు ఆలోచనను లేదా అలవాటును మార్చుకుంటే వాళ్ల జీవితం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ విద్యార్థి యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు, మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం’ వీడియోలోని ఒక సన్నివేశం. స్టడీ జరుగుతున్నప్పుడు నీతా జాస్మిన్‌ను ఒక ప్రశ్న అడుగుతోంది.

    “సోమవారం మాట్లాడుకున్న దాని గురించి ఆలోచించావా” అని నీతా జాస్మిన్‌ను ఎందుకు అడిగింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం’ వీడియోలోని ఒక సన్నివేశం. నీతా లేఖనాల్ని వివరిస్తోంది.

    బైబిలు ప్రమాణాలు యెహోవా ప్రేమతో ఇచ్చాడని జాస్మిన్‌ అర్థం చేసుకోవడానికి నీతా ఎలా సహాయం చేసింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం’ వీడియోలోని ఒక సన్నివేశం. నీతా చెప్పేది జాస్మిన్‌ వింటోంది.

    మనం విద్యార్థి హృదయాన్ని చేరుకునేలా బోధించినప్పుడు వాళ్లు యెహోవాకు మరింత దగ్గరౌతారు

    దేవునిపై ఉన్న ప్రేమను చూపించడానికి జాస్మిన్‌కు నీతా ఎలా సహాయం చేసింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి