దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 35-36
తన పని చేయడానికి యెహోవా మనల్ని సిద్ధం చేస్తున్నాడు
గుడారంలోని పనులన్నీ చేయడానికి బెసలేలు, అహోలీయాబులకు యెహోవా పవిత్రశక్తి సహాయం చేసింది. ఎంతో బలాన్నిచ్చే పవిత్రశక్తిని యెహోవా నేడు కూడా తన సేవకులకు ఇస్తున్నాడు. మనం దాన్ని పొందాలంటే ఏమి చేయాలి?
యెహోవా సేవ చేయడానికి మనకున్న సామర్థ్యాలను పెంచుకునేలా, పవిత్రశక్తినిచ్చి సహాయం చేయమని ప్రార్థించాలి
దేవుని ప్రేరేపిత వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి
ఎలాంటి నియామకం ఇచ్చినా దాన్ని మన శక్తి లోపం లేకుండా చేయడానికి ప్రయత్నించాలి
ఎలాంటి నియామకాలు కోసం యెహోవా మిమ్మల్ని సిద్ధం చేయగలడు?