మన క్రైస్తవ జీవితం
మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?
యెషయా ప్రవచించినట్టు, యెహోవా సంస్థలోని భూభాగం ముందెన్నడూ లేనంత ఎక్కువగా విస్తరిస్తోంది. (యెష 54:2) దానివల్ల కొత్త రాజ్యమందిరాల్ని, సమావేశ హాళ్లను, బ్రాంచి భవనాల్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వాటిని నిర్మించిన తర్వాత, అవి మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి; కొన్నిటికి మరమ్మతులు చేయాలి. యెహోవాకు మన సమయాన్ని, శక్తిని ఇచ్చే అవకాశాన్ని ఈ పనులు ఎలా కల్పిస్తాయి?
మన క్షేత్రసేవా గుంపు వంతు వచ్చినప్పుడు, రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనిలో మనం భాగం వహించవచ్చు
మన రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఎలా ఉంచుకోవాలో శిక్షణ ఇచ్చేటప్పుడు, మనం స్వచ్ఛందంగా వెళ్లి నేర్చుకోవచ్చు
లోకల్ డిజైన్/కన్స్ట్రక్షన్ వాలంటీర్ అప్లికేషన్ (DC-50) నింపి, మన ప్రాంతానికి దగ్గర్లో నిర్మాణ పని లేదా మరమ్మతు పని జరిగినప్పుడు వెళ్లి సహాయం చేయవచ్చు
అప్లికేషన్ ఫర్ వాలంటీర్ ప్రోగ్రామ్ (A-19) నింపి, మన బ్రాంచి క్షేత్రంలో ఉన్న బెతెల్లో గానీ, వేరే బ్రాంచి భవనంలో గానీ ఒక వారంపాటు లేదా అంతకన్నా ఎక్కువకాలం స్వచ్ఛందంగా పనిచేయవచ్చు
ఒక కొత్త నిర్మాణపని కోసం ప్రణాళిక—చిన్న భాగం వీడియో చూడండి; తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
మనం 2014 నుండి వీడియోలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నాం?
మన ఆరాధనలో వీడియోలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి, ఏ నిర్మాణపని కోసం ప్రణాళిక వేశారు? అది పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది?
ఈ పనికి వాలంటీర్లు ఎలా సహాయం చేయవచ్చు?
ఒకవేళ మనం రామపోలో జరుగుతున్న నిర్మాణ పనిలో సహాయం చేయాలనుకుంటే అప్లికేషన్ను (DC-50) ఎందుకు నింపాలి? మన ప్రాంతంలో జరిగే లోకల్ డిజైన్/కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల్లో ఎందుకు సహాయం చేయాలి?
ఈ నిర్మాణపనిని యెహోవాయే నడిపిస్తున్నాడు అనడానికి ఏ రుజువు ఉంది?
మనం నిర్మాణ పనిలో సహాయం చేయలేకపోయినా ఈ ప్రాజెక్టుకు ఎలా మద్దతివ్వవచ్చు?