దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 29-30
యెహోవాకు ఇచ్చే కానుక
ధనికులు, పేదవాళ్లు అనే తేడా లేకుండా, ప్రత్యక్ష గుడారం నిర్మాణం కోసం కానుకలు ఇస్తూ యెహోవా ఆరాధనకు మద్దతిచ్చే అవకాశం ఆకాలంలోని ప్రతీఒక్కరికి దొరికింది. నేడు మనం యెహోవాకు కానుకను ఏవిధంగా ఇవ్వవచ్చు? దానికి ఒక విధానం ఏంటంటే: రాజ్యమందిరాలు, సమావేశ హాళ్లు, అనువాద కార్యాలయాలు, బెతెల్ భవనాలు, యెహోవా ఆరాధనకు సమర్పించబడిన ఇతర భవనాల కోసం డబ్బును విరాళంగా ఇవ్వడం.
సత్యారాధనకు మద్దతుగా డబ్బును విరాళంగా ఇవ్వడం గురించి ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయి?