కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఆగస్టు పేజీ 3
  • అంతం దగ్గరపడుతుండగా స్థిరంగా నిలబడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంతం దగ్గరపడుతుండగా స్థిరంగా నిలబడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—ధైర్యం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ధైర్యంగా ఉండడం సాధ్యమే
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఆగస్టు పేజీ 3

మన క్రైస్తవ జీవితం

అంతం దగ్గరపడుతుండగా స్థిరంగా నిలబడండి

ఎందుకు ముఖ్యం? కొన్ని అసాధారణ సంఘటనలు ముందెప్పుడూ లేని విధంగా మన ధైర్యాన్ని, యెహోవా మీద మనకున్న నమ్మకాన్ని త్వరలోనే పరీక్షిస్తాయి. అబద్ధమతం నాశనంతో మహాశ్రమ మొదలౌతుంది. (మత్త 24:21; ప్రక 17:16, 17) అలాంటి భయంకరమైన సమయంలో, మనం వడగండ్ల లాంటి తీర్పు సందేశాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. (ప్రక 16:21) మాగోగు వాడైన గోగు చేసే దాడిని మనం ఎదుర్కొంటాం. (యెహె 38:10-12, 14-16) అప్పుడు యెహోవా తన ప్రజల్ని కాపాడడానికి, “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే” యుద్ధాన్ని మొదలుపెడతాడు. (ప్రక 16:14, 16) ఈ భవిష్యత్‌ సంఘటనల కోసం మన ధైర్యాన్ని పెంచుకోవడానికి, మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్లో ఇప్పుడే స్థిరంగా నిలబడాలి.

దాన్నెలా చేయాలి?

  • యెహోవా ఉన్నతమైన నైతిక ప్రమాణాల్ని సమర్థిస్తూ, వాటిని పాటించండి.—యెష 5:20

  • తోటి క్రైస్తవులతో కలిసి యెహోవాను ఆరాధిస్తూ ఉండండి.—హెబ్రీ 10:24, 25

  • యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని వెంటనే పాటించండి.—హెబ్రీ 13:17

  • యెహోవా గతంలో తన ప్రజల్ని ఎలా కాపాడాడో లోతుగా ఆలోచించండి.—2పే 2:9

  • యెహోవాకు ప్రార్థించండి, ఆయనపై నమ్మకం ఉంచండి.—కీర్త 112:7, 8

ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు—చిన్నభాగం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు’ వీడియోలోని ఒక సన్నివేశం. రాజ్యమందిరంలో ఒక సహోదరి, సంఘాల్ని కలిపినప్పుడు ఎవరెవరు ఏ సంఘాలకు వెళ్తారో చదివిన తర్వాత ఆందోళనగా ఉంది.

    తాము వెళ్లే సంఘాన్ని వేరే సంఘాలతో కలిపినప్పుడు ప్రచారకుల విధేయతకు ఎలాంటి పరీక్ష ఎదురైంది?

  • ‘ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు’ వీడియోలోని ఒక సన్నివేశం. అదే సహోదరి కొత్త సంఘ నియామకాల గురించి వేరే ఇద్దరు సహోదరీలతో మాట్లాడుతోంది.

    విధేయత చూపించడం వల్ల మనం ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు?

  • ‘ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు’ వీడియోలోని ఒక సన్నివేశం. ఒక అబ్బాయి ‘దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!’ పుస్తకంలో హార్‌మెగిద్దోనుకు సంబంధించిన చిత్రం గురించి ధ్యానించిన తర్వాత ఆందోళనగా ఉన్నాడు.

    హార్‌మెగిద్దోన్‌ వచ్చినప్పుడు ధైర్యం ఎందుకు అవసరమౌతుంది?

  • ‘ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు’ వీడియోలోని ఒక సన్నివేశం. యెహోషాపాతు, ఇతరులు యూదా నుండి యుద్ధ భూమికి వచ్చి శత్రువుల్లో ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో లేకపోవడం చూస్తున్నారు.

    ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనల కోసం ఇప్పుడే సిద్ధపడండి

    యెహోవా మనల్ని కాపాడగలడనే మన నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఏ బైబిలు వృత్తాంతం సహాయపడుతుంది?—2ది 20:1-24

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి