దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 40-41
యెహోవా యోసేపును విడిపించాడు
యోసేపు దాదాపు 13 సంవత్సరాలు బానిసగా, ఖైదీగా ఉన్న తర్వాత యెహోవా అతన్ని విడిపించాడు. తనకు ఎదురైన పరిస్థితిని బట్టి యోసేపు కోపం పెంచుకునే బదులు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాడు. (కీర్త 105:17-19) యెహోవా తనను ఎప్పుడూ విడిచిపెట్టలేదని యోసేపుకు తెలుసు. అతను ఆ పరిస్థితిలో చేయగలిగినదంతా ఎలా చేశాడు?
అతను కష్టపడ్డాడు, నమ్మకంగా పని చేశాడు కాబట్టి యెహోవా అతన్ని దీవించాడు.—ఆది 39:21, 22
తనతో చెడుగా ప్రవర్తించిన వాళ్ల మీద పగ పెంచుకునే బదులు ఇతరులపై శ్రద్ధ చూపించాడు.—ఆది 40:5-7
కష్టాల్ని సహించడానికి యోసేపు ఉదాహరణ నాకు ఎలా సహాయం చేస్తుంది?
హార్‌మెగిద్దోన్‌లో యెహోవా నన్ను విడిపించేంత వరకు, నాకున్న పరిస్థితిలో చేయగలిగినదంతా ఎలా చేయవచ్చు?