కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 8
  • నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యౌవనులారా, ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 8
మానవ రూపంలో ఉన్న దేవదూతతో యాకోబు కుస్తీ పడుతున్నాడు.

మన క్రైస్తవ జీవితం

నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

యాకోబు చాలా ముఖ్యమైన దాని కోసం, అంటే యెహోవా దీవెన కోసం దేవదూతతో కుస్తీ పడ్డాడు. (ఆది 32:24-31; హోషే 12:3, 4) మరి మన సంగతేంటి? యెహోవాకు లోబడే విషయంలో, ఆయన దీవెన పొందే విషయంలో తీవ్రంగా కృషి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఉదాహరణకు, సంఘ కూటానికి వెళ్లాలా లేక ఉద్యోగంలో ఎక్కువ గంటలు పని చేయాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తే, మనం ఏ నిర్ణయం తీసుకుంటాం? మన సమయం, శక్తి, వనరుల్లో శ్రేష్ఠమైనవి యెహోవాకు ఇస్తే “కొరత అనేదే లేకుండాపోయే వరకు” ఆయన మనపై దీవెనలు కుమ్మరిస్తాడు. (మలా 3:10) ఆయన మనల్ని నడిపిస్తాడు, కాపాడతాడు, మన అవసరాలు చూసుకుంటాడు.—మత్త 6:33; హెబ్రీ 13:5.

ఆధ్యాత్మిక లక్ష్యాల మీదే మనసుపెట్టండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సంజ్ఞా భాష అనువాదకురాలిగా బయట ఉద్యోగం చేస్తున్న ఒక పయినీరు సహోదరి.

    తనకు బాగా ఇష్టమైన దాని నుండి ఒక సహోదరికి ఎలాంటి పరీక్ష ఎదురైంది?

  • ఆ పయినీరు సహోదరి బాగా పొద్దుపోయే వరకు ఆఫీసులో పని చేస్తోంది.

    ఉద్యోగం వల్ల మనకెలాంటి పరీక్ష ఎదురవ్వవచ్చు?

  • బాగా పొద్దుపోయిన తర్వాత కిటికీ దగ్గర నిలబడి గ్రంథపు చుట్ట చదువుతున్న తిమోతి.

    ఆధ్యాత్మిక పరిణతి సాధించిన తర్వాత కూడా తిమోతి ఎందుకు లక్ష్యాలు పెట్టుకుంటూ ఉండాలని పౌలు చెప్పాడు?—1తి 4:16

  • ఆ పయినీరు సహోదరి, మరో సహోదరి బైబిలు స్టడీకి వెళ్లి ఆ విద్యార్థిని పలకరిస్తున్నారు.

    మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

    మనకు అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏదో ఎలా చూపిస్తాం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి