కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 అక్టోబరు పేజీ 8
  • శుభ్రంగా ఉండే ప్రజలంటే యెహోవాకు ఇష్టం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుభ్రంగా ఉండే ప్రజలంటే యెహోవాకు ఇష్టం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిశుభ్రతకు నిజమైన అర్థం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • శుభ్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 అక్టోబరు పేజీ 8
రాజ్యమందిరంలోని బాత్రూమ్‌ సింకును శుభ్రం చేస్తున్న సహోదరుడు

మన క్రైస్తవ జీవితం

శుభ్రంగా ఉండే ప్రజలంటే యెహోవాకు ఇష్టం

“చేతులు కడుక్కో. గది శుభ్రం చేయి. ఇల్లు ఊడువు. చెత్త పడేయి.” చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఎలా శుభ్రంగా ఉండాలో నేర్పిస్తారు. నిజానికి శుభ్రంగా ఉండడం మన పవిత్ర దేవుడైన యెహోవా దగ్గర నుండి మొదలైంది. (నిర్గ 30:18-20; ద్వితీ 23:14; 2 కొరిం 7:1) మనం మన శరీరాన్ని, మన వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకుంటే యెహోవాను ఘనపరుస్తాం. (1 పేతు 1:14-16) మన ఇల్లు, పరిసరాల సంగతేంటి? రోడ్ల మీద, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసే వాళ్లలా కాకుండా క్రైస్తవులు భూమిని శుభ్రంగా ఉంచడానికి బాగా కష్టపడతారు. (కీర్త 115:16; ప్రక 11:18) చాక్లెట్‌ కాగితాలను, కూల్‌డ్రింక్‌ బాటిళ్లను, బబుల్‌ గమ్‌లను ఎక్కడ పడేస్తాం, ఎలా పడేస్తాం లాంటివి చిన్నచిన్న విషయాలే కావచ్చు, కానీ శుభ్రత విషయంలో మన అభిప్రాయం ఏంటో అవి తెలియజేస్తాయి. జీవితంలోని ప్రతీ విషయంలో మనల్ని మనం “దేవుని పరిచారకులుగా సిఫారసు” చేసుకోవాలన్నదే మన కోరిక.—2 కొరిం 6:3, 4.

శుభ్రంగా ఉండే ప్రజలంటే దేవునికి ఇష్టం వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • తమ వస్తువుల్ని శుభ్రంగా పెట్టుకోకపోవడానికి కొంతమంది ఎలాంటి సాకులు చెప్తారు?

  • శుభ్రత విషయంలో యెహోవా అభిప్రాయాన్ని మోషే ధర్మశాస్త్రం ఎలా తెలియజేసింది?

  • మనం ఏమీ మాట్లాడకుండానే యెహోవా గురించి ఎలా సాక్ష్యం ఇవ్వగలం?

మురికిగా ఉన్న కొడుకు కార్‌లో కూర్చుంటున్న తండ్రి; శుభ్రత విషయంలో యెహోవా ప్రమాణాల్ని చర్చిస్తున్న తండ్రి కొడుకుల; ప్రాచీన ఇశ్రాయేలులో శుభ్రం చేసుకోవడానికి పెట్టిన రాగి గిన్నె దగ్గర ఇద్దరు యాజకులు; ఇప్పుడు శుభ్రంగా ఉన్న కొడుకు కార్‌లో నుండి బయటకి వస్తున్న ప్రచారకులు

శుభ్రత విషయంలో యెహోవా ఆలోచనలకు తగ్గట్టు నేను ఎలా జీవించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి