మన క్రైస్తవ జీవితం
“వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి”
వేటి గురించి? ఫిలిప్పీయులు 4:8 చెప్తున్నట్లు, నిజమైన, ప్రాముఖ్యమైన, నీతిగల, పవిత్రమైన, ప్రేమించదగిన, గౌరవప్రదమైన, మంచివైన, పొగడదగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. నిజమే, క్రైస్తవులు బైబిలు విషయాల గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా ఉండకుండా చేసే వాటిగురించి ఆలోచించకూడదు.—కీర్త 19:14.
చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం కష్టంగా ఉండవచ్చు. మనం మన అపరిపూర్ణ శరీరంతో మాత్రమే కాదు, ‘ఈ లోక దేవుడైన’ సాతానుతో కూడా పోరాడాల్సి ఉంటుంది. (2 కొరిం 4:4) ఈ లోకంలో ఉన్న వినోదం సాతాను చెప్పుచేతల్లో ఉంది కాబట్టి టీవీల్లో, రేడియోల్లో, ఇంటర్నెట్‌లో, అలాగే పేపర్లలో, పుస్తకాల్లో చాలావరకు దిగజారిపోయిన విషయాలే ఉన్నాయి. మన మనసులోకి ఎలాంటి విషయాలు వెళ్తున్నాయో మనం జాగ్రత్తగా చూసుకోకపోతే, మన ఆలోచనా విధానం కలుషితమైపోతుంది, చివరికి దాని ప్రభావం మన ప్రవర్తన మీద పడుతుంది.—యాకో 1:14, 15.
విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—చెడు వినోదం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
సహోదరుడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడు? దాని ప్రభావం అతనిమీద ఎలా పడింది?
గలతీయులు 6:7, 8, కీర్తన 119:37 వచనాలు అతనికి ఎలా సహాయం చేశాయి?