దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 12-13
క్రమశిక్షణ—యెహోవా ప్రేమకు రుజువు
క్రమశిక్షణలో సరిదిద్దడం, ఉపదేశం ఇవ్వడం, నేర్పించడం ఉన్నాయి. పిల్లల మీద ప్రేమ ఉన్న తండ్రి వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చినట్లే, యెహోవా మనకు క్రమశిక్షణ ఇస్తాడు. మనం వీటి ద్వారా క్రమశిక్షణ పొందుతాం:
బైబిల్ని చదివినప్పుడు, మన క్రైస్తవ ప్రచురణల్ని అధ్యయనం చేసినప్పుడు, మీటింగ్స్‌కి వచ్చినప్పుడు, నేర్చుకున్నవాటిని ధ్యానించినప్పుడు
తోటి క్రైస్తవుడు మనకు సలహా ఇచ్చినప్పుడు లేదా సరిదిద్దినప్పుడు
మన తప్పుల పర్యవసానాల్ని మనం అనుభవిస్తున్నప్పుడు
మనల్ని గద్దించినప్పుడు లేదా బహిష్కరించినప్పుడు
యెహోవా అనుమతించే కష్టాల్ని, హింసను అనుభవిస్తున్నప్పుడు.—w15 9/15 21వ పేజీ, 13వ పేరా; it-1-E 629వ పేజీ