కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 3
  • యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోవాషు చెడు సహవాసంవల్ల యెహోవాను విడిచిపెట్టాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • రాజవంశాన్ని కాపాడాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మనం యెహోవాకు ఎందుకు భయపడాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ధైర్యం చూపిస్తే యెహోవా దీవిస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 3

మన క్రైస్తవ జీవితం

యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి

మనం యెహోవాను ప్రేమించేవాళ్లతో ఎందుకు సమయం గడపాలి? ఎందుకంటే, మనం ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతామో, వాళ్లు మనల్ని మంచి చేసేలా లేదా చెడు చేసేలా ప్రభావితం చేస్తారు. (సామె 13:20) ఉదాహరణకు, రాజైన యోవాషు ప్రధాన యాజకుడైన యెహోయాదాతో సమయం గడిపినంత కాలం “యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను” అని బైబిలు చెప్తుంది. (2 దిన 24:2) యెహోయాదా చనిపోయాక యోవాషుకున్న చెడ్డ స్నేహితుల వల్ల ఆయన యెహోవాను విడిచిపెట్టాడు.—2 దిన 24:17-19.

మొదటి శతాబ్దంలో, అపొస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘాన్ని ఒక ‘గొప్ప ఇంటితో,’ సంఘంలో ఉన్న సభ్యులను ‘పాత్రలతో’ లేదా ఇంట్లో వాడే వస్తువులతో పోల్చాడు. మనం యెహోవాకు ఇష్టంలేని పనులు చేసే ఎవ్వరితోనూ, వాళ్లు కుటుంబ సభ్యులైనా, సంఘంలో వాళ్లైనా స్నేహం చేయకూడదు. అప్పుడే మనం “ప్రాముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా” ఉంటాం. (2 తిమో 2:20, 21) కాబట్టి, యెహోవాను ప్రేమించేవాళ్లతో, ఆయన సేవ చేసేలా మనల్ని ప్రోత్సహించేవాళ్లతో స్నేహం చేయాలని నిశ్చయించుకుందాం.

చెడు స్నేహాలకు దూరంగా ఉండడం నేర్చుకోండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • చెడు ప్రభావం చూపించేవాళ్లతో మనకు తెలియకుండానే మనం ఎలా సమయం గడిపే అవకాశం ఉంది?

  • చెడు స్నేహాలకు దూరంగా ఉండడానికి, వీడియోలో చూపించిన ముగ్గురు క్రైస్తవులకు ఏది సహాయం చేసింది?

  • ఎవరితో స్నేహం చేయాలో తెలివిగా నిర్ణయించుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు మీకు సహాయం చేయగలవు?

ఒక హోటల్‌లో జాన్‌ క్లయింట్లకు మద్యం పోస్తున్నాడు; క్రిస్టీన్‌ సోషల్‌ మీడియా చూస్తుంది; జేడెన్‌ ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతున్నాడు; జాన్‌ మీటింగ్‌లో తన కుటుంబంతో కూర్చున్నాడు, క్రిస్టీన్‌, జేడెన్‌ కూడా ఉన్నారు

నేను “ప్రాముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా” ఉన్నానా?—2 తిమో 2:21

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి