దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 థెస్సలొనీకయులు 1-5
“ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”
ప్రతీ క్రైస్తవునికి వేరేవాళ్లను ప్రోత్సహించే సామర్థ్యం ఉంది. ఉదాహరణకు మనం అనారోగ్యంతో, ఇతర సమస్యలతో “ఎన్నో సంఘర్షణల మధ్య” ఉన్నా మీటింగ్స్‌కి, పరిచర్యకు మానకుండా వెళ్లినప్పుడు తోటి క్రైస్తవులు ప్రోత్సాహం పొందుతారు. (1 థెస్స 2:2, అధస్సూచి) అలాగే, ఏం మాట్లాడాలో కాస్త ముందుగా ఆలోచించడం ద్వారా, లేదా పరిశోధించడం ద్వారా మనం తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించవచ్చు.
ఒకానొక సమస్యతో బాధపడుతున్నవాళ్లను ఎలా ప్రోత్సహించాలో తెలుసుకోవడానికి మనం ఎక్కడ పరిశోధన చేయవచ్చు?
మీరు సంఘంలో ఎవర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నారు?