మన క్రైస్తవ జీవితం
క్విబెక్‌లో మన పనిని చట్టబద్ధం చేయడం
తనను విచారణ చేస్తున్నప్పుడు, పౌలు కైసరుకు విన్నవించుకుంటానని అన్నాడు. రోమా పౌరుడిగా తనకున్న హక్కును ఉపయోగించుకోవడం ద్వారా, మనం అనుసరించాల్సిన ఒక పద్ధతిని పౌలు మనకు తెలియజేశాడు. క్విబెక్‌లో మన పనిని చట్టబద్ధం చేయడం వీడియో చూసి, మంచివార్త తరఫున వాదించడానికి క్విబెక్‌లో మన సహోదరులు చట్టపరమైన ఏర్పాట్లను ఎలా ఉపయోగించుకున్నారో తెలుసుకోండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబివ్వండి:
క్విబెక్‌లో మన సహోదరులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
ఏ ప్రత్యేకమైన కరపత్రాన్ని వాళ్లు పంచిపెట్టారు, దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
సహోదరుడు ఈమా బ్యూషాకు ఏం జరిగింది?
సహోదరుడు ఈమా బ్యూషా కేసులో కెనడా సుప్రీం కోర్టు ఏమని తీర్పిచ్చింది?
సహోదరులు ఏ అరుదైన చట్టపరమైన ఏర్పాటును ఉపయోగించుకున్నారు, దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
మతనాయకుడి మాటలు విని పోలీసులు క్రైస్తవ కూటాన్ని అడ్డుకున్న తర్వాత ఏం జరిగింది?