దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 25-26
పౌలు కైసరుకు విన్నవించుకుంటానని అన్నాడు, తర్వాత రాజైన హేరోదు అగ్రిప్పకు సాక్ష్యమిచ్చాడు
“అధిపతుల ముందుకు, రాజుల ముందుకు” తీసుకెళ్లబడినప్పుడు ఏం మాట్లాడాలా అని మనం ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా, మన “నిరీక్షణ గురించి అడిగే ప్రతీ ఒక్కరికి జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా” ఉండాలి. (మత్త 10:18-20; 1 పేతు 3:15) వ్యతిరేకులు ‘కట్టడవలన కీడు కల్పించడానికి’ ప్రయత్నిస్తే, మనం పౌలు ఆదర్శాన్ని ఎలా అనుకరించవచ్చు?—కీర్త 94:20.
మనం మంచివార్త తరఫున వాదించడం కోసం మనకున్న చట్టపరమైన హక్కుల్ని ఉపయోగిస్తాం.—అపొ 25:11
అధికారులతో మర్యాదగా మాట్లాడతాం.—అపొ 26:2, 3
సముచితమైతే, మంచివార్త వల్ల మనం అలాగే ఇతరులు ఎలా ప్రయోజనం పొందారో వివరిస్తాం.—అపొ 26:11-20