నవంబరు 12-18
అపొస్తలుల కార్యాలు 1-3
పాట 104, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“క్రైస్తవ సంఘం మీద పవిత్రశక్తి కుమ్మరించబడింది”: (10 నిమి.)
[అపొస్తలుల కార్యాలుకి పరిచయం వీడియో చూపించండి.]
అపొ 2:1-8, 14, 37, 38, 41—పవిత్రశక్తి పొందిన తర్వాత యేసు శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. దానివల్ల 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు
అపొ 2:42-47—యెరూషలేమును సందర్శిస్తున్న వాళ్లు కొత్తగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత అక్కడే కొంతకాలం ఉండి తమ విశ్వాసాన్ని బలపర్చుకునేలా యేసు శిష్యులు గొప్ప ఉదారతను, ఆతిథ్యాన్ని చూపించారు (w86-E 12/1 29వ పేజీ, 4-5, 7 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 3:15—‘జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి’ అని యేసు, ఎందుకు పిలవబడ్డాడు? (it-2-E 61వ పేజీ, 1వ పేరా)
అపొ 3:19—తప్పుచేసినవాళ్లు పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా క్షమించే విధానాన్ని ఈ వచనం ఎలా వివరిస్తుంది? (cl 265వ పేజీ, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 2:1-21
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) it-1-E 129వ పేజీ, 2-3 పేరాలు—అంశం: నమ్మకంగా ఉండి చనిపోయిన అపొస్తలుల స్థానంలో వేరే అపొస్తలులను ఎన్నుకోలేదు, కానీ యూదా స్థానంలో మరొకరిని ఎందుకు ఎన్నుకున్నారు?
మన క్రైస్తవ జీవితం
వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడం: (15 నిమి.) సేవా పర్యవేక్షకుడు చర్చిస్తాడు. వీడియో చూపించి చర్చించండి. వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడానికి స్థానికంగా చేసిన ఏర్పాట్ల గురించి వివరించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 20వ అధ్యా., 7-16 పేరాలు, 215వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 124, ప్రార్థన