మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చేలా మాట్లాడండి
యేసు ఒక సమరయ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టాడు కాబట్టే ఆమెకు అనియతంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు. కొత్తవాళ్లతో సంభాషణలు మొదలుపెట్టే నైపుణ్యాలను మనమెలా మెరుగుపర్చుకోవచ్చు?
స్నేహపూర్వకంగా ఉంటూ, ప్రజలతో మాట్లాడండి. అలసిపోయినప్పటికీ, కేవలం తాగడానికి నీళ్లు అడగడం ద్వారా యేసు తన సంభాషణ మొదలుపెట్టాడు. కాబట్టి మీరు చక్కగా పలకరించి, తర్వాత బహుశా వాతావరణం గురించి, లేదా ప్రస్తుతం జరిగే సంఘటనల గురించి మాట్లాడవచ్చు. ముందుగా మీ లక్ష్యం కేవలం సంభాషణ మొదలుపెట్టడమే అని గుర్తుంచుకోండి. కాబట్టి, అవతలి వాళ్లకు ఆసక్తిగా అనిపించే ఏ విషయం గురించైనా మాట్లాడవచ్చు. అతను లేదా ఆమె స్పందించకపోయినా ఏమి ఫర్వాలేదు. ఈసారి మరొకరితో ప్రయత్నించి చూడండి. యెహోవాను ధైర్యం ఇవ్వమని అడగండి.—నెహె 2:4; అపొ 4:29.
మంచివార్త గురించి మాట్లాడడానికి అప్రమత్తంగా ఉండండి, అలాగని తొందరపడకండి. సంభాషణ సహజంగా మొదలయ్యేలా చూడండి. మీరు బలవంతం చేస్తే, అవతలి వాళ్లు ఇబ్బంది పడి సంభాషణను ఆపేయవచ్చు. మీరు సాక్ష్యం ఇవ్వకముందే మీ సంభాషణ ముగించాల్సి వస్తే నిరుత్సాహపడకండి. మంచివార్త పరిచయం చేసే విషయంలో మీకు భయంగా ఉంటే, సాక్ష్యం ఇవ్వకుండానే ఊరికే సంభాషణ ఎలా మొదలుపెట్టాలో ప్రాక్టీసు చేయండి. [1వ వీడియో చూపించి, చర్చించండి.]
మీ విశ్వాసం గురించి హృదయపూర్వకంగా వివరించే అవకాశాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు మీ మాటలు వింటున్నవాళ్లు దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అడగవచ్చు. అలా మీరు సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని కల్పించుకోగలుగుతారు. యేసు మాట్లాడిన ఆసక్తికరమైన విషయాలను బట్టి ఆ స్త్రీ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. అప్పుడు యేసు కేవలం ఆ ప్రశ్నలకు జవాబు ఇస్తూనే మంచివార్తను పరిచయం చేశాడు. [2వ వీడియో చూపించి చర్చించండి, తర్వాత 3వ వీడియో చూపించి చర్చించండి.]