జ్ఞాపకార్థ ఆచరణకు పస్కా పండుగ పూర్వఛాయగా లేకపోయినప్పటికీ, పస్కా పండుగలో ఉన్న కొన్ని విషయాలను తెలుసుకోవడం మనకు అవసరం. అపొస్తలుడైన పౌలు యేసును “పస్కా గొర్రెపిల్ల” అని పిలిచాడు. (1 కొరిం 5:7) గొర్రెపిల్ల రక్తం తలుపులకు రాయడం ద్వారా ప్రాణాలు కాపాడబడినట్లే, యేసు రక్తం ప్రాణాలను కాపాడుతుంది. (నిర్గ 12:12, 13) అంతేకాదు పస్కా గొర్రెపిల్ల ఎముకల్లో ఒకటి కూడా విరగలేదు. అలానే యేసుకు కూడా ఏ ఎముక విరగలేదు. నిజానికి అలా శిక్షించబడినవాళ్ల ఎముకలను విరగగొట్టే ఆచారం అప్పట్లో ఉండేది.—నిర్గ 12:46; యోహా 19:31-33, 36.