కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 సెప్టెంబరు పేజీ 19
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఇలాంటి మరితర సమాచారం
  • 70 మంది శిష్యుల్ని ప్రకటించడానికి పంపించాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు వీడ్కోలు మాటలను లక్ష్యపెట్టడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • శేదరు నుండి రక్షణకు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 సెప్టెంబరు పేజీ 19
యేసు, తన నమ్మకమైన అపొస్తలులతో ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపిస్తున్నాడు.

పాఠకుల ప్రశ్న

ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించినప్పుడు, యేసు అంతకుముందు ప్రకటించడానికి పంపించిన 70 మంది శిష్యులు ఏమయ్యారు? వాళ్లు ఆయన్ని వదిలేశారా?

ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు స్థాపించినప్పుడు ఆ 70 మంది అక్కడ లేకపోవడానికి కారణం వాళ్లపై యేసు ఆమోదం లేదని లేక వాళ్లు ఆయన్ని వదిలేశారని కాదు. ఆ సందర్భంలో యేసు కేవలం తన అపొస్తలులతో ఉండాలనుకున్నాడు అంతే.

ఆ 12 మంది అలాగే 70 మంది అందరూ యేసు శిష్యులే. అయితే తనకున్న ఎంతోమంది శిష్యుల్లో, ముందు 12 మందిని ఎంచుకుని వాళ్లను అపొస్తలులని పిలిచాడు. (లూకా 6:12-16) ఆయన గలిలయలో ఉన్నప్పుడు “ఆ పన్నెండుమందిని పిలిచి, . . . దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, రోగుల్ని బాగుచేయడానికి” వాళ్లను పంపించాడు. (లూకా 9:1-6) తర్వాత యూదయలో “ఇంకో 70 మందిని ఎంచుకొని, . . . ఇద్దరిద్దరిగా పంపించాడు.” (లూకా 9:51; 10:1) అలా యేసుకు వేర్వేరు ప్రాంతాల్లో మంచివార్త ప్రకటించే శిష్యులు ఉన్నారు.

అయితే యేసు శిష్యులైన యూదులు పస్కా పండుగను ప్రతీ సంవత్సరం, బహుశా వాళ్ల కుటుంబాలతో కలిసి చేసుకుని ఉంటారు. (నిర్గ. 12:6-11, 17-20) తన మరణానికి సమయం దగ్గరపడే కొద్దీ యేసు, అపొస్తలులు యెరూషలేముకు వెళ్లారు. కానీ ఆయన తన శిష్యులందర్నీ అంటే యూదయ, గలిలయ, పెరయ లాంటి ప్రాంతాల్లో ఉన్న శిష్యులందర్నీ యెరూషలేముకు పిలవలేదు. కాబట్టి ఈ సందర్భంలో యేసు కేవలం తన అపొస్తలులతో ఉండాలనుకున్నాడని అర్థమౌతుంది. ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను బాధలు పడకముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని ఎంతో కోరుకున్నాను.”—లూకా 22:15.

అలా చేయడానికి మంచి కారణమే ఉంది. యేసు త్వరలోనే ‘లోక పాపాల్ని తీసేసే దేవుని గొర్రెపిల్లలా’ చనిపోబోతున్నాడు. (యోహా. 1:29) అది యెరూషలేములో జరగబోతుంది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా దేవునికి బలులు అర్పించబడుతున్నాయి. ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఐగుప్తు నుండి విడుదల చేశాడని పస్కా గొర్రెపిల్ల గుర్తుచేస్తుంది. కానీ యేసు బలి అంతకన్నా గొప్పది. ఆయన మనుషులందర్నీ పాపమరణాల నుండి విడుదల చేస్తాడు. (1 కొరిం. 5:7, 8) యేసు చేసిన దానివల్ల పన్నెండుమంది అపొస్తలులు క్రైస్తవ సంఘానికి పునాది అవుతారు. (ఎఫె. 2:20-22) ఆసక్తికరంగా పవిత్ర నగరమైన యెరూషలేములో ‘12 పునాదిరాళ్లు ఉన్నాయి. వాటిమీద గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు ఉన్నాయి.’ (ప్రక. 21:10-14) అవును, ఆ నమ్మకమైన అపొస్తలులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి యేసు వాళ్లతో కలిసి చివరి పస్కాను అలాగే తర్వాత వచ్చిన ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు చేయాలనుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

70 మంది అలాగే ఇతర శిష్యులు యేసుతో కలిసి ప్రభువు రాత్రి భోజనంలో లేరు. కానీ నమ్మకంగా ఉన్న శిష్యులందరూ యేసు మొదలుపెట్టిన ఆ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందుతారు. ఆ రోజు రాత్రి యేసు అపొస్తలులకు రాజ్య ఒప్పందం గురించి చెప్పాడు. అయితే మిగతా శిష్యుల్లో ఎవరైతే తర్వాత అభిషిక్త క్రైస్తవులు అయ్యారో వాళ్లందరూ కూడా ఆ ఒప్పందంలోకి వచ్చారు.—లూకా 22:29, 30.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి