మన క్రైస్తవ జీవితం
నిజమైన ప్రేమ అంటే ఏంటి?
యెహోవా వివాహాన్ని పురుషుడికి స్త్రీకి మధ్య శాశ్వతంగా ఉండే బంధంగా రూపొందించాడు. (ఆది 2:22-24) లైంగిక పాపాలు చేసినప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. (మలా 2:16; మత్త 19:9) భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటాడు. అందుకే క్రైస్తవులు మంచి జీవితభాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి కావాల్సిన సూత్రాలను ఇచ్చాడు.—ప్రసం 5:4-6.
నిజమైన ప్రేమ అంటే ఏంటి? వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
ఫ్రాంక్, బోనీ వాళ్ల కూతురు లిజ్‌కు ఇచ్చిన సలహా ఏ విధంగా తెలివితో, ప్రేమతో ఇచ్చింది?
మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్లను మీరు మార్చగలరు అని అనుకోవడం ఎందుకు తెలివితక్కువతనం?
పాల్, ప్రిసిల్లా లిజ్‌కు ఏ తెలివైన సలహా ఇచ్చారు?
జాక్, మేగన్ వివాహంలో ఎందుకు సమస్యలు వచ్చాయి?
జాన్, లిజ్ ఇద్దరికీ సమానంగా ఉన్న ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏంటి?
మీరు ఎవరితోనైనా పెళ్లి ప్రమాణాలు చేయక ముందు వాళ్ల హృదయం లోపల ఉన్న మనిషిని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? (1 పేతు 3:4)
నిజమైన ప్రేమ అంటే ఏంటి? (1 కొరిం 13:4-8)