దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 32-34
కాపలాకాసే వాళ్లకున్న బరువైన బాధ్యత
కాపలాకాసే వాళ్లు పట్టణం ద్వారాల దగ్గర, కోటల దగ్గర ఉండి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంటారు. యెహోవా యెహెజ్కేలును సూచనార్థక భావంలో “ఇశ్రాయేలీయులకు కావలివానిగా” నియమించాడు.
ఇశ్రాయేలీయులు వాళ్ల చెడు మార్గాలను విడిచిపెట్టకపోతే నాశనం అవుతారని యెహెజ్కేలు హెచ్చరించాడు
యెహోవా నుండి వచ్చిన ఏ సందేశాన్ని ఈరోజు మనం చెప్తున్నాం?
ఆ హెచ్చరిక చెప్పడం వల్ల యెహెజ్కేలు తన ప్రాణాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు
యెహోవా మనకు అప్పగించిన అత్యవసర సందేశాన్ని ప్రకటించడానికి మనల్ని ఏది పురికొల్పుతుంది?