కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూన్‌ పేజీ 8
  • ప్రకటనా పనిలో ఆనందాన్ని పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనా పనిలో ఆనందాన్ని పొందండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచివార్తను ఎవరు ప్రకటిస్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ‘సువర్తమానము ప్రకటించడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • “సంతోషముతో యెహోవాను సేవించండి”
    మన రాజ్య పరిచర్య—2003
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూన్‌ పేజీ 8

మన క్రైస్తవ జీవితం

ప్రకటనా పనిలో ఆనందాన్ని పొందండి

మీకు ఎప్పుడైనా ప్రీచింగ్‌ చేయడం కష్టంగా అనిపించిందా? ఆ ప్రశ్నకు మనలో చాలామంది అవును అనే చెప్తాము. ఎందుకు? ఎందుకంటే మన క్షేత్రంలో ఎక్కువగా వ్యతిరేకతను లేదా ఆసక్తి లేని ప్రజలను కలుస్తుండవచ్చు. ఇంకా మనకు కొత్తవాళ్లతో మాట్లాడడానికి భయంగా ఉండవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మన ఆనందాన్ని తగ్గిస్తాయి. కానీ మనం సంతోషం గల దేవున్ని ఆరాధిస్తాము. మనం కూడా సంతోషంగా ఆయనకు సేవ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్త 100:2; 1 తిమో 1:11) ప్రకటనా పనిని ఆనందించడానికి మూడు కారణాలు ఉన్నాయి.

ఒకటి, మనం ప్రజల్లో ఆశను చిగురింపజేసే సందేశాన్ని చెప్తున్నాం. నిజమే ఇప్పుడు సమాజంలో మంచి జరుగుతుందనే ఆశాభావం లేదు. కానీ ప్రజల హృదయాల్లో మంచి జరుగుతుంది అనే వార్తను మనం నింపవచ్చు. (యెష 52:7) దేవుని రాజ్యం గురించిన మంచివార్త మనలో కూడా ఆనందాన్ని నింపుతుంది. ప్రీచింగ్‌కి వెళ్లేముందు, మనం దేవుని రాజ్యం వల్ల భూమి మీద వచ్చే ఆశీర్వాదాల గురించి ధ్యానించాలి.

రెండవది, మనం ప్రకటించే మంచివార్త ప్రజలకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనాలను తెస్తుంది. చెడు అలవాట్లు ఎలా మానుకోవాలో, శాశ్వత జీవితాన్ని ఎలా పొందాలో వాళ్లు నేర్చుకుంటారు. (యెష 48:17, 18; రోమా 1:16) ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లను వెదికి కాపాడే పనిలో ఉన్నట్లు మనల్ని మనం ఊహించుకోవచ్చు. కొంతమందికి అలాంటి సహాయం ఇష్టం ఉండదు, అయినా సహాయం కావాలనుకునే వాళ్లకోసం మనం వెదుకుతూనే ఉంటాం.—మత్త 10:11-14.

మూడవది, ముఖ్యమైనది, మన ప్రకటనా పని యెహోవాకు గౌరవాన్ని తెస్తుంది. ఆయన మనం చేసే ప్రకటనా పనిని ఎంతో అమూల్యంగా చూస్తాడు. (యెష 43:10; హెబ్రీ 6:10) దానితోపాటు ఈ పనిని పూర్తి చేయడానికి ఆయన మనకు ఉదారంగా పవిత్రశక్తిని ఇస్తాడు. కాబట్టి పవిత్రశక్తి ఫలితంగా వచ్చే సంతోషం కోసం మనం యెహోవాను వేడుకుందాం. (గల 5:22) ఆయన సహాయంతో మనకున్న భయాలను పోగొట్టుకుని ధైర్యంగా ప్రకటించవచ్చు. (అపొ 4:31) అప్పుడు మన ప్రాంతంలో వాళ్లు సరిగ్గా స్పందించకపోయినా, మనం మనకున్న నియామకంలో సంతోషాన్ని పొందుతాము.—యెహె 3:3.

ప్రీచింగ్‌ చేసేటప్పుడు వేర్వేరు వైఖరులు​—⁠సంతోషంగా లేకపోవడం, సంతోషంగా ఉండడం

మీరు పరిచర్య చేసేటప్పుడు ఏ వైఖరితో ఉండాలని అనుకుంటున్నారు? మీరు మీ ఆనందాన్ని ఎలా చూపించవచ్చు?

బైబిల్ని చక్కగా చదువుతూ ధ్యానిస్తూ ఆనందాన్ని తిరిగి సంపాదించుకోండి వీడియో చూశాక ఈ కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • మనం ప్రతీనెల ఎన్నో గంటలు ప్రీచింగ్‌ చేస్తున్నప్పటికీ, ఆధ్యాత్మికత కోసం చేసే అధ్యయనాన్ని మనం ఎందుకు ముఖ్యంగా చూడాలి?

  • మనం ఏ విషయంలో మరియను అనుకరించవచ్చు?

  • దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఎప్పుడు సమయం తీసుకుంటారు?

  • మంచివార్తను ప్రకటిస్తున్నప్పుడు మీకు సంతోషం తెచ్చే విషయాలు ఏంటి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి