దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 1-5
దేవుని సందేశాన్ని ప్రకటించడానికి యెహెజ్కేలు ఎంతో సంతోషించాడు
ఒక దర్శనంలో యెహోవా యెహెజ్కేలుకు ఒక గ్రంథపు చుట్టను ఇచ్చి దానిని తినమన్నాడు. దాని అర్థం ఏంటి?
యెహెజ్కేలు దేవుని సందేశాన్ని పూర్తిగా గ్రహించాలి. ఆ గ్రంథపు చుట్టలో ఉన్న మాటలను ధ్యానించినప్పుడు అవి యెహెజ్కేలు లోలోపలి భావాల్లోకి చొచ్చుకుపోయి అతను మాట్లాడేలా చేశాయి
యెహెజ్కేలు తన నియామకాన్ని మంచి దృక్పథంతో చూస్తున్నాడు కాబట్టి ఆ గ్రంథపుచుట్ట ఆయనకు తీయగా అనిపించింది