దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 44-48
“నీ నిమిత్తము నీవు గొప్పవాటిని” వెదకవద్దు
బారూకు రాజ ఆస్థానంలో విద్యావంతుడైన అధికారి అయ్యుంటాడు. ఆయన యెహోవాను ఆరాధించినప్పటికీ, నమ్మకంగా యిర్మీయాకు సహాయం చేస్తున్నప్పటికీ ఒక సందర్భంలో కొంచెం దారితప్పాడు. ఆయన “గొప్పవాటిని” వెదకడం మొదలుపెట్టాడు. బహుశా రాజ ఆస్థానంలో ఇంకాస్త పేరును లేదా వస్తుసంపదలను కోరుకుని ఉంటాడు. యెరూషలేము నాశనం అయినప్పుడు తప్పించుకోవాలంటే తన ఆలోచనలను సరిచేసుకోవాలి.