దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 39-43
ప్రతి ఒక్కరికి వాళ్ల పనులను బట్టి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు
బబులోనుకు లొంగిపోమని యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని సిద్కియా పాటించలేదు
సిద్కియా కళ్ల ముందే అతని కొడుకుల్ని చంపేశారు. అతని కళ్లు ఊడదీసి అతణ్ణి రాగి సంకెళ్లతో బంధించారు, చనిపోయే వరకు బబులోను చెరసాలలో బంధించారు
ఎబెద్మెలెకు యెహోవా మీద నమ్మకం ఉంచాడు, ప్రవక్తయైన యిర్మీయా మీద శ్రద్ధ చూపించాడు
యూదా నాశనం అప్పుడు ఎబెద్మెలెకును కాపాడతానని యెహోవా మాట ఇచ్చాడు
యెరూషలేము నాశనానికి ముందు చాలా సంవత్సరాలు యిర్మీయా ధైర్యంగా ప్రకటించాడు
యెరూషలేము ముట్టడి వేయబడినప్పుడు యెహోవా యిర్మీయాను కాపాడాడు, బబులోనీయుల ద్వారా విడిపించాడు