మన క్రైస్తవ జీవితం
యెహోవాను జ్ఞాపకం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయం చేయండి
యూదులు వాళ్ల దేవుడైన యెహోవా గురించి మర్చిపోయారు కాబట్టి వచ్చే నాశనం గురించి వాళ్లను హెచ్చరించడానికి యిర్మీయా నియమించబడ్డాడు. (యిర్మీ 13:25) ఘోరమైన ఆధ్యాత్మిక స్థితిలోకి ఆ దేశం ఎలా వచ్చింది? ఇశ్రాయేలు కుటుంబాలు ఆధ్యాత్మికతను పోగొట్టుకున్నాయి. కుటుంబ పెద్దలు ద్వితీయోపదేశకాండము 6:5-7 లో యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని ఖచ్చితంగా పాటించడం లేదు.
ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాల వల్ల నేడు మన సంఘాలు స్థిరంగా ఉంటాయి. క్రమంగా, ఉపయోగపడే విధంగా చేసే కుటుంబ ఆరాధన ద్వారా యెహోవాను గుర్తుచేసుకోవడానికి కుటుంబ పెద్దలు కుటుంబాలకు సహాయం చేయవచ్చు. (కీర్త 22:27) ‘ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి’ —కుటుంబాల ఇంటర్వ్యూలు, వీడియో చూశాక ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
కుటుంబ ఆరాధనకు సాధారణంగా ఉండే అడ్డంకులను కుటుంబాలు ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు?
క్రమంగా, ఉపయోగపడే విధంగా చేసే కుటుంబ ఆరాధన వల్ల ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి?
కుటుంబ ఆరాధన విషయంలో నాకు ఎలాంటి అడ్డంకులు వస్తాయి, వాటిని పరిష్కరించుకోవడానికి నేను ఏమి చేస్తాను?