దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 12-16
ఇశ్రాయేలీయులు యెహోవాను మర్చిపోయారు
యూదా, యెరూషలేము ప్రజలు ఎంతో మొండిగా, గర్వంగా ఉన్నారు. యెహోవా వాళ్లను నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. దాన్ని వాళ్లు తెలుసుకునేలా యిర్మీయాకు ఒక కష్టమైన నియామకం ఇచ్చాడు.
యిర్మీయా అవిసెనార నడికట్టు కొన్నాడు
నడుముకు కట్టుకునే నడికట్టు యెహోవాకు ఆయన ప్రజలకూ మధ్య ఉండాల్సిన దగ్గరి సంబంధాన్ని చూపించింది
యిర్మీయా ఆ నడికట్టును యూఫ్రటీసు నది దగ్గరికి తీసుకెళ్లాడు
ఆయన దాన్ని బండ సందులో దాచిపెట్టి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు
ఆ నడికట్టును తీసుకురావడానికి యిర్మీయా మళ్లీ యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్లాడు
ఆ నడికట్టు పాడైపోయింది
ఇచ్చిన నియామకాన్ని పూర్తి చేశాక యెహోవా ఆ విషయాన్ని యిర్మీయాకు వివరించాడు
అది చాలా చిన్న విషయంగా అనిపించి ఉండవచ్చు, అయినా యిర్మీయా మనస్ఫూర్తిగా విధేయత చూపించాడు. అలా ప్రజల హృదయాలు చేరుకోవడానికి యెహోవా చేసిన ప్రయత్నాల్లో సహాయపడ్డాడు