అల్బేనియాలో ప్రజలను ప్రభువు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
దేవుని రాజ్యం అంటే ఏమిటి? (T-36)
ప్రశ్న: కన్నీళ్లు, బాధ, మరణం లేని పరిస్థితి ఎప్పటికైనా వస్తుందంటారా? [ఇంటివాళ్లకు ఆసక్తి ఉంటే మాట్లాడడం కొనసాగించండి.] దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని గమనించండి.
వచనం: ప్రక 21:3, 4
ఇలా చెప్పవచ్చు: ఈ పేపరులో దీని గురించి ఇంకొంత సమాచారం ఉంది.
దేవుని రాజ్యం అంటే ఏమిటి? (T-36)
ప్రశ్న: మనం ఎప్పుడూ చూడని ఒక మంచి పరిపాలన గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? [ఇంటివాళ్లకు ఆసక్తి ఉంటే వచనం చదవండి.]
వచనం: దాని 2:44
ఇలా చెప్పవచ్చు: ఆ పరిపాలన మీకోసం ఏమి చేస్తుందో ఈ పేపరులో చూడండి.
జ్ఞాపకార్థ ఆహ్వానం
ఇలా చెప్పవచ్చు: ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మేము అందర్నీ ఆహ్వానిస్తున్నాం. [ఆహ్వాన ప్రతి ఇవ్వండి.] ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసు మరణం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏమిటో అక్కడ ఇచ్చే ప్రసంగంలో మీరు ఉచితంగా వినవచ్చు. ఆ మీటింగ్ మన ప్రాంతంలో ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఇందులో ఉంది. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం.
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.