దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 52-57
క్రీస్తు మన కోసం శ్రమలు పడ్డాడు
“అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును . . . మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి”
యేసును తృణీకరించారు, దేవదూషణ చేసినట్లు నేరం మోపారు. అసహ్యమైన వ్యాధితో మొత్తినట్లుగా దేవుడు ఆయన్ని శిక్షిస్తున్నాడని కొంతమంది నమ్మారు
“అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, . . . యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును”
తన కొడుకుని చంపినప్పుడు యెహోవా ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. కానీ యేసు చూపించిన పూర్తి నమ్మకాన్ని చూసి ఆయన ఎంతో సంతోషించి ఉంటాడు. యేసు మరణం దేవుని సేవకుల నమ్మకత్వానికి సంబంధించి సాతాను లేవదీసిన ప్రశ్నకు జవాబు ఇచ్చింది. పశ్చాత్తాపం చూపించిన మనుషులకు ప్రయోజనాలు తెచ్చింది. అలా ‘యెహోవా ఉద్దేశము’ సఫలం చేయడానికి యేసు మరణం కారణం అయ్యింది