దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 24-28
యెహోవా ఆయన ప్రజలను చూసుకుంటాడు
ఒక మంచి అతిథేయునిగా యెహోవా దేవుడు మనకు పుష్కలంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాడు.
సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము విందు చేయును
బైబిల్ కాలాల్లో ఎవరైనా ఇతరులతో కలిసి భోజనం చేస్తే, అది సమాధానానికి, స్నేహానికి గుర్తుగా ఉండేది
“మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును”
క్రొవ్విన ఆహారం, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసం, యెహోవా మన కోసం ఇచ్చే అతి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక ఆహారానికి గుర్తుగా ఉన్నాయి