దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 27-31
గుణవతియైన భార్య ఎలా ఉంటుందో బైబిలు వివరిస్తుంది
సామెతలు 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలుకు అతని తల్లి చెప్పిన ముఖ్యమైన సందేశం ఉంది. ఆమె చెప్పిన తెలివైన ఉపదేశం వల్ల గుణవతియైన భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఆయన నేర్చుకున్నాడు.
గుణవతియైన భార్య నమ్మదగినది
లోబడే భార్యగా ఉంటూనే ఆమె కుటుంబానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సలహాలు ఇస్తుంది
మంచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె భర్త ఆమెను నమ్ముతాడు, భార్య ప్రతీ విషయంలో తన అనుమతి తీసుకోవాలని భర్త పట్టుపట్టడు
గుణవతియైన భార్య కష్టపడి పని చేస్తుంది
ఆమె పొదుపుగా ఉండడం, గొప్పలు పోకుండా జీవించడం నేర్చుకుని, కుటుంబంలో అందరూ మంచి బట్టలు వేసుకుని, మర్యాదగా కనబడేలా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుంది
కష్టపడి పని చేస్తూ తన కుటుంబాన్ని పగలు రాత్రి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
గుణవతియైన భార్య మంచి ఆధ్యాత్మిక స్త్రీ
ఆమె దేవునికి భయపడుతూ, ఆయనతో మంచి సంబంధాన్ని కాపాడుకుంటుంది