మన క్రైస్తవ జీవితం
మంచి కామెంట్స్ ఎలా చెప్పాలి
మంచి కామెంట్స్ వల్ల సంఘం బలపడుతుంది. (రోమా 14:19) కామెంట్ చెప్పేవాళ్లు కూడా ప్రయోజనం పొందుతారు. (సామె 15:23, 28) కాబట్టి, మనం మీటింగ్స్‌లో ఒక్క కామెంట్ అయినా చెప్పడానికి ప్రయత్నించాలి. మనం చెయ్యి ఎత్తిన ప్రతీసారి మనల్ని అడగరు. కాబట్టి, మనం ఎక్కువ కామెంట్స్ ప్రిపేర్ అయితే మంచిది.
ఒక మంచి కామెంట్. . .
అర్థమయ్యేలా, స్పష్టంగా, చిన్నగా ఉండాలి. కామెంట్స్‌ను ఎక్కువగా 30 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే చెప్పాలి
సొంత మాటల్లో చెప్పాలి
వేరేవాళ్లు చెప్పిన కామెంట్‌ని మళ్లీ చెప్పకూడదు
మొదటి కామెంట్ మిమ్మల్ని అడిగితే . . .
అర్థమయ్యేలా, సూటిగా ప్రశ్నకు జవాబు చెప్పాలి
ప్రశ్నకు సంబంధించిన సమాధానం వచ్చేస్తే, మీరు . . .
అక్కడ ఇచ్చిన లేఖనానికీ చర్చిస్తున్న విషయానికీ ఎలాంటి సంబంధం ఉందో చెప్పండి
దాన్ని మన జీవితంలో ఎలా ఆచరించాలో చెప్పండి
ఈ సమాచారం ఎలా ఉపయోగపడుతుందో వివరించండి
ముఖ్యమైన విషయాన్ని వివరించే ఒక అనుభవం క్లుప్తంగా చెప్పండి