దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 12-16
బంగారము కంటే జ్ఞానం విలువైనది
ముద్రిత ప్రతి
దేవుడిచ్చే జ్ఞానం లేదా తెలివి ఎందుకు విలువైనది? ఎందుకంటే ఆ తెలివి ఉన్నవాళ్లు చెడు మార్గాల నుండి బయట పడతారు, ప్రాణాలను కాపాడుకుంటారు. అది వాళ్ల స్వభావం, మాటలు, పనులపైన మంచి ప్రభావం చూపిస్తుంది.
తెలివి గర్వం నుండి కాపాడుతుంది
తెలివి ఉన్న అతను యెహోవాయే తెలివికి మూలం అని గ్రహిస్తాడు
మంచి స్థాయికి చేరుకుని, అనుకున్నవన్నీ సాధించినవాళ్లు, లేదా ఎక్కువ బాధ్యతలు పొందినవాళ్లు, గర్వం అహంకారం నుండి ముఖ్యంగా కాపాడుకోవాలి
తెలివి ఉన్నవాళ్లు మేలు జరిగేలా మాట్లాడతారు
తెలివి ఉన్న అతను చక్కగా ఆలోచించి వేరే వాళ్లలో మంచిని చూస్తాడు వాళ్ల గురించి మంచిగా మాట్లాడతాడు
తెలివైన మాటలు ఇతరులకు నచ్చే విధంగా, స్వీకరించే విధంగా, తేనెలా మధురంగా ఉంటాయి. కఠినంగా, వాదిస్తున్నట్లు ఉండవు