మన క్రైస్తవ జీవితం
సత్యాన్ని బోధించండి
సెప్టెంబరు నెల నుండి క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌లో “ఇలా ఇవ్వవచ్చు” భాగంలో “సత్యాన్ని బోధించండి” అనే క్రొత్త అంశాన్ని చేరుస్తారు. ఒక ప్రశ్న, ఒక వచనం ఉపయోగించి ముఖ్య బైబిలు సత్యాన్ని చెప్పడమే మన ఉద్దేశం.
ఇంటివాళ్లకు ఆసక్తి ఉందని మనకు అనిపిస్తే, వాళ్ల ఆసక్తిని పెంచడానికి ఒక ప్రచురణ ఇచ్చి లేదా jw.org వెబ్‌సైట్ నుండి వీడియో చూపించి మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. సాధ్యమైనంత త్వరగా వాళ్లను తిరిగి కలుసుకుని చర్చను కొనసాగించాలి. క్రొత్త ప్రదర్శనలు, విద్యార్థి నియామకాలు అన్ని వాట్ కెన్ ద బైబిల్ టీచ్ అజ్? (తెలుగులో లేదు) పుస్తకంలో ఉన్న అధ్యాయాల సారాంశం ఆధారంగా ఉంటాయి. ఈ పుస్తకం బైబిలు బోధిస్తోంది పుస్తకానికి సింప్లిఫైడ్ ఎడిషన్. పునర్దర్శనాలు చేయడానికి, బైబిల్ని మాత్రమే ఉపయోగించి బైబిలు స్టడీ చేయడానికి కావాల్సిన సమాచారం, వచనాలు బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి తీసుకోవచ్చు.
జీవానికి నడిపించే మార్గం ఒకటే. (మత్త 7:13, 14) రకరకాల మతాలు, జీవన స్థితిగతులు నుండి వచ్చినవాళ్లతో మనం మాట్లాడుతుంటాం కాబట్టి వాళ్లకు తగిన బైబిలు సత్యాలను చెప్పాలి. (1 తిమో 2:4) రకరకాల బైబిలు అంశాల గురించి మాట్లాడడం నేర్చుకున్నప్పుడు, “సత్యవాక్యమును సరిగా” ఉపదేశించే విషయంలో మన నైపుణ్యం పెరుగుతుంది. అప్పుడు మన సంతోషం ఎక్కువౌతుంది, అందరికీ సత్యాన్ని ఇంకా బాగా నేర్పించగలం.—2 తిమో 2:15.