మన క్రైస్తవ జీవితం
ఒక సంవత్సరం ప్రయత్నించి చూడండి
ఏమి ప్రయత్నించాలి? క్రమ పయినీరు సేవ! మీకు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి! —సామె 10:22.
పయినీరు సేవ ద్వారా మీరు . . .
సువార్తికునిగా మంచి నైపుణ్యం పెంచుకోవచ్చు, పరిచర్యను ఎక్కువ ఆనందించవచ్చు
యెహోవాతో మీ సంబంధాన్ని ఇంకా బలపర్చుకోవచ్చు. ఆయన గురించి ఇతరులతో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ మీరు ఆయన అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటారు
మీ ఇష్టాలను కాకుండా రాజ్యాశక్తుల్ని ముందుంచడం వల్ల వచ్చే సంతృప్తిని అనుభవిస్తారు, ఇతరుల కోసం మీరు కష్టపడడం వల్ల వచ్చే ఆనందాన్ని పొందుతారు.—మత్త 6:33; అపొ 20:35
ప్రయాణ పర్యవేక్షకుని సందర్శనంలో జరిగే పయినీరు మీటింగ్‌కు హాజరు అవ్వవచ్చు. ప్రాంతీయ సమావేశానికి ముందు జరిగే పయినీరు మీటింగ్‌కి వెళ్లవచ్చు, పయినీరు సేవ పాఠశాలకు కూడా వెళ్లవచ్చు
ఎక్కువ బైబిల్ స్టడీలు చేసే అవకాశం దొరుకుతుంది
తోటి సహోదరులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వస్తుంది, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆనందించవచ్చు.—రోమా 1:11, 12