మన క్రైస్తవ జీవితం
దేవుణ్ణి స్తుతించడానికి సాధారణ జీవితం సహాయం చేస్తుంది
ఈరోజుల్లో ఎన్నో విషయాలు, వ్యాపకాలు వల్ల మన జీవితాలు గందరగోళం అయిపోతున్నాయి. షాపింగ్ చేయడానికి, దేన్నైనా కొనడానికి, దాన్ని వాడడానికి, పాడవకుండా చూసుకోవడానికి, మనకున్న వాటన్నిటిని కాపాడుకోవడానికి సమయం, శక్తి అవసరం. యేసు చాలా సాధారణంగా జీవించాడు. అందువల్ల సంపద, ఆస్తి లాంటివేవీ పరిచర్య నుండి ఆయన దృష్టి మళ్లించలేక పోయాయి.—మత్త 8:20.
పరిచర్యలో ఎక్కువ సమయం గడపడానికి మీరు మీ జీవితంలో అనవసరమైన వాటిని తగ్గించుకోగలరా? కొన్ని సర్దుబాట్లు చేసుకుని మీ కుటుంబంలో ఎవరైనా పయినీరు సేవ మొదలుపెట్టవచ్చా? ఒకవేళ మీరు ఇప్పటికే పూర్తికాల సేవలో ఉంటే, వస్తువులు, సంపద పెంచుకుంటూ మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నారా? యెహోవా సేవ చేస్తూ సాధారణ జీవితం గడిపితే చాలా సంతోషంగా సంతృప్తిగా ఉండవచ్చు.—1 తిమో 6:7-9.
సాధారణ జీవితం గడపడానికి మీరు ఏమి తగ్గించుకోవాలి అనుకుంటున్నారో రాసుకోండి.