దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 11-18
యెహోవా గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు?
యెహోవా గుడారంలో అతిథిగా ఉండడం అంటే దేవుని స్నేహితునిగా ఉండడం, ఆయనను పూర్తిగా నమ్ముతూ, ఆయనకు లోబడి ఉండడం. యెహోవా ఎలాంటి వాళ్లను తన స్నేహితులుగా చేసుకుంటాడో 15వ కీర్తన వర్ణిస్తుంది.
యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏమి చేయాలి
యథార్థమైన ప్రవర్తన ఉండాలి
హృదయంలో కూడా అబద్ధం చెప్పకూడదు
తోటి ఆరాధకులను గౌరవించాలి
ఎంత కష్టమైనా మాట తప్పకూడదు
ఏమి ఆశించకుండా అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలి
యిహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏమి చేయకూడదు
పుకార్లు, లేనిపోని మాటలు కల్పించి చెప్పకూడదు
పొరుగువాళ్లకు చెడు చేయకూడదు
సహోదరులను వాడుకోకూడదు
యెహోవాను సేవించని వాళ్లతో, ఆయనకు లోబడని వాళ్లతో స్నేహం చేయకూడదు
లంచం తీసుకోకూడదు