దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 28-32
యోబు యథార్థత విషయంలో మంచి ఉదాహరణ
యెహోవా దేవుడు పెట్టిన నీతి నియమాలు పాటించాలని యోబు నిశ్చయించుకున్నాడు
యోబు, తన భార్యను తప్ప ఇంకెవ్వరినీ మోహంతో చూడకుండా తన కళ్లను అదుపులో పెట్టుకున్నాడు
ఎదుటివాళ్లతో చక్కగా ప్రవర్తించే విషయంలో యోబు ఒక మంచి ఉదాహరణ
ఆయన వినయం, న్యాయం, కరుణ వంటి లక్షణాలు చూపించాడు. డబ్బున్నా లేకపోయినా, సమాజంలో పేరున్నా లేకపోయినా ఆయన అందరితో దయగా ఉన్నాడు
యోబు ఉదారంగా ఉన్నాడు, స్వార్థం చూపించలేదు
ఆయనలో సహాయపడే స్వభావం ఉంది, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేశాడు