దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 11-15
యోబుకు చనిపోయిన వాళ్లు బ్రతుకుతారనే నమ్మకం ఉంది
చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించే శక్తి దేవునికి ఉందని యోబుకు బాగా నమ్మకం
యోబు బహుశా ఓలీవ చెట్టు గురించి చెప్తూ చనిపోయిన వాళ్లను దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే తన నమ్మకాన్ని వివరించాడు
ఓలీవ చెట్టు మొద్దును నరికి వేసినా, లోతుగా పాతుకుని ఉన్న వేర్లు వల్ల అది తిరిగి చిగుర్చుతుంది. దాని వేర్లు భూమిలో జీవంతో ఉంటే అది తప్పకుండా చిగుర్చుతుంది
వర్షం లేక చాలాకాలం ఎండిపోయి ఉన్నా, వర్షం పడగానే మళ్లీ చిగిర్చి, మళ్లీ పెరుగుతుంది