దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 1-5
యోబుకు పరీక్షలు ఎదురైనా యథార్థంగా ఉన్నాడు
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సమయంలో యోబు ఊజు దేశంలో నివసించాడు. ఇశ్రాయేలీయుడు కాకపోయినా యోబు యెహోవాను నమ్మకంగా ఆరాధించాడు. ఆయనకు పెద్ద కుటుంబం, ఎంతో ఆస్తి, ప్రజలలో పలుకుబడి ఉన్నాయి. ఆయన అందరికి మంచి సలహాలు ఇస్తూ నిష్పక్షపాతంగా న్యాయం తీర్చేవాడు. అవసరంలో ఉన్నవాళ్లకు, పేదవాళ్లకు దానం చేసేవాడు. యోబు యథార్థపరుడు.
యెహోవాయే తన జీవితంలో ముఖ్యమైన వాడని యోబు చూపించాడు
యోబు యథార్థతను సాతాను గమనించాడు. యోబు యెహోవాకు లోబడడం లేదని సాతాను అనలేదు, కానీ యోబు ఉద్దేశాలను తప్పుపట్టాడు
యోబు స్వార్థంతో యెహోవాను సేవిస్తున్నాడని ఆరోపించాడు
సాతాను ఆరోపణలకు జవాబు చెప్పాలనే ఉద్దేశంతో సాతాను యోబును పరీక్షించేలా యెహోవా అనుమతించాడు. సాతాను యోబు జీవితంలో ఎన్నో నష్టాలు తెచ్చాడు
సాతాను యోబు యథార్థతను పరీక్షిస్తున్నప్పుడే మనుషులందరి యథార్థతను కూడా ప్రశ్నించాడు
యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు నా విషయంలో తప్పు చేశాడని అనలేదు