కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/15 పేజీ 2
  • మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?
  • మన రాజ్య పరిచర్య—2015
మన రాజ్య పరిచర్య—2015
km 12/15 పేజీ 2

మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?

1. స్కూలుకు వెళ్లే పిల్లలు ఎందుకు సిద్ధంగా ఉండాలి?

1 మీ పిల్లలు స్కూల్లో ఎన్నో సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. అయితే ‘సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి’ వాళ్లకు ఎన్నో అవకాశాలు కూడా దొరుకుతాయి. (యోహా. 18:37, 38) మరి వాళ్లు సిద్ధంగా ఉన్నారా?

2. మీ పిల్లలు సిద్ధంగా ఉండాలంటే వాళ్లు ఏం అర్థంచేసుకోవాలి?

2 జాతీయ వేడుకలకు, అన్యమత పండుగలకు సంబంధించి స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో, వాటిని చేయడం ఎందుకు తప్పో మీ పిల్లలు స్పష్టంగా అర్థం చేసుకున్నారా? పైచదువులు చదవమని, డేటింగ్‌ చేయమని, మద్యాన్ని లేదా డ్రగ్స్‌ను తీసుకోమని ఎవరైనా ఒత్తిడి చేస్తే, వాటిని ఎదుర్కోవడానికి మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా? వాళ్లు, ఫలానా పని చేయడం తమ మతానికి వ్యతిరేకమని చెప్పి ఊరుకుంటారా, లేదా తాము దాన్ని ఎందుకు చేయట్లేదో వివరిస్తారా?—1 పేతు. 3:15, 16.

3. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సిద్ధం చేయడానికి కుటుంబ ఆరాధనా సమయాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

3 కుటుంబ ఆరాధనా సమయాన్ని ఉపయోగించండి: విద్యా సంవత్సరమంతటిలో మీ పిల్లలు కొత్తకొత్త సమస్యల్ని ఎదుర్కోవచ్చు, కాబట్టి వాటి గురించి వాళ్లతో చర్చిస్తూ ఉండండి. అలా చర్చించడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేసినప్పుడు, మీ పిల్లలు ధైర్యంగా ఉంటారు. అందుకోసం, మీ కుటుంబ ఆరాధనా సమయాన్ని ఉపయోగించగలరేమో ఆలోచించండి. స్కూలుకు వెళ్లడానికి సిద్ధపడుతున్న మీ పిల్లలు వేటి గురించి భయపడుతున్నారో మీరు అడగవచ్చు. ఇప్పుడు మీ పిల్లలు కొంచెం ఎదిగారు, అలాగే విషయాల్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారు, కాబట్టి మీరు అంతకుముందు సంవత్సరాల్లో చర్చించిన విషయాల్ని మళ్లీ ఒకసారి వాళ్లకు గుర్తుచేయవచ్చు. (కీర్త. 119:95) మీరు టీచరుగా, సలహాదారునిగా లేదా తోటి విద్యార్థిగా నటిస్తూ మీ పిల్లలతో ప్రాక్టీసు చేయవచ్చు. బైబిల్ని, అలాగే మన ప్రచురణల్ని ఉపయోగించి ఎలా జవాబివ్వాలో మీ పిల్లలకు నేర్పించండి. ఓ సహోదరి, ప్రతీ సంవత్సరం స్కూలు ప్రారంభమయ్యాక, తన పిల్లలు కొత్త టీచర్లను కలిసి తాము యెహోవాసాక్షులమని ఎలా చెప్పాలో ప్రాక్టీసు చేయించేది.—కావలికోట డిసెంబరు 15, 2010, 3-5 పేజీలు చూడండి.

4. తమ పిల్లలు సిద్ధంగా ఉండడానికి తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారు?

4 ఈ చివరిరోజుల్లో క్రైస్తవ యౌవనులు ఎదుర్కొనే సవాళ్లు అంతకంతకూ కష్టంగా తయారౌతున్నాయి. (2 తిమో. 3:1) అయితే, తెలివైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎదురయ్యే సమస్యల్ని ముందుగానే ఊహించి, వాటిని అధిగమించేలా వాళ్లను సిద్ధం చేస్తారు. (సామె. 22:3) మీ పిల్లలు సిద్ధంగా ఉండడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి