చక్కగా బోధించాలంటే ముందే ప్రిపేర్ అవ్వాలి
నిత్యజీవం గురించి యేసును కనీసం రెండుసార్లైనా అడిగుంటారు, కానీ ప్రతీసారి ఆ ప్రశ్న అడిగిన వాళ్ల అవసరాన్నిబట్టి ఆయన జవాబిచ్చాడు. (లూకా 10:25-28; 18:18-20) కాబట్టి మనం మాట్లాడబోయే బైబిలు విషయాలు మనకు బాగా తెలిసినా, విద్యార్థిని మనసులో పెట్టుకుని ముందే ప్రిపేర్ అవ్వాలి. ఆయనకు ఏ విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి? ఏవి ఒప్పుకోవడం కష్టంగా ఉంటాయి? స్టడీ చేసేటప్పుడు ఏయే వచనాలు చదవాలి? ఎంత సమాచారాన్ని స్టడీ చేయాలి? విద్యార్థి సమాచారాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేయడానికి ఒక ఉపమానాన్ని, కొంత వివరణని, కొన్ని ప్రశ్నల్ని ముందే ఆలోచించి పెట్టుకోవచ్చు. దానితోపాటు సత్యం అనే విత్తనం పెరగడానికి కారణం యెహోవాయే కాబట్టి మనం స్టడీ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుని ఆశీర్వాదం కోసం అడగాలి. విద్యార్థిని, విద్యార్థికి ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి చేసే ప్రయత్నాలను కూడా ఆశీర్వదించమని అడగాలి.—1 కొరిం. 3:6; యాకో. 1:5.