నవంబరు 9తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 9తో మొదలయ్యే వారం
పాట 13, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 50వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 21-25 (8 నిమి.)
నం. 1: 1 దినవృత్తాంతములు 23:1-11 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఎలీషా—అంశం: యెహోవా సేవకుల పట్ల ప్రగాఢ గౌరవం చూపించండి —1 రాజులు 19:16–21; 2 రాజులు 2:3–5; 3:11 (5 నిమి.)
నం. 3: రాజ్యం—‘హృదయాలలో’ లేదు, మానవ ప్రయత్నాలతో రాదు—td 35సి (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” —1 కొరిం. 3:6.
10 నిమి: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. (1 కొరిం. 3:6) సమయం ఉంటే, కావలికోట, జూలై 15, 2008, 12-16 పేజీల్లో విషయాలు చెప్పండి. రానున్న వారాల్లో వచ్చే సేవా కూటంలోని అంశాలను క్లుప్తంగా చెప్పి అవి ముఖ్యాంశంతో ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పండి.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం ఎలా ఇవ్వాలి?” చర్చ. రెండు చిన్న ప్రదర్శనలు చేయించండి. వాటిలో ఒకటి ఇక్కడ ఇచ్చిన సలహాను పాటిస్తూ చేయాలి. ఇంకొకటి బాగా ఉపయోగపడిన ఒక సొంత ప్రదర్శన చేయించండి.
పాట 12, ప్రార్థన