పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం ఎలా ఇవ్వాలి?
ఎందుకు ప్రాముఖ్యం? బైబిలు బోధిస్తోంది పుస్తకం మనం ఉపయోగించే పనిముట్లలో చాలా ముఖ్యమైంది. అయితే ఆ పుస్తకంతో ఎవరికైనా స్టడీ చేయాలంటే ముందు దాన్ని వాళ్లకివ్వాలి కదా. కాబట్టి మనమంతా బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచర్యలో ఇవ్వడానికి మంచి నైపుణ్యం సంపాదించుకోవాలి. (సామె. 22:29) చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ ప్రచారకులు వాళ్లకు బాగా ఉపయోగపడే పద్ధతిని వాడాలి. మనం ఎక్కువగా మంచివార్త! బ్రోషురుతో బైబిలు స్టడీ మొదలుపెట్టినా తర్వాత స్టడీని బైబిలు బోధిస్తోంది పుస్తకంలోకి మారుస్తాము. కొన్నిసార్లు నిజంగా ఇష్టం చూపించిన వాళ్లకు మాత్రం బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇవ్వవచ్చు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
కుటుంబ ఆరాధనలో వీటిని చేసి చూడండి.
పరిచర్యలో ఉన్నప్పుడు, మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారో మీతో ఉన్నవాళ్లకు చెప్పండి. (సామె. 27:17) ఒక పద్ధతి సరిగ్గా ఉపయోగపడకపోతే వేరేది ఉపయోగించండి.