అక్టోబరు 19తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 19తో మొదలయ్యే వారం
పాట 26, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 47వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 8-11 (8 నిమి.)
నం. 1: 1 దినవృత్తాంతములు 11:15-25 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఏలీయా—అంశం: ప్రార్థనకున్న శక్తిని తక్కువ అంచనా వేయకండి —1 రాజు. 18:18-46; యాకో. 5:17 (5 నిమి.)
నం. 3: దేవుని రాజ్యం మానవులకు ఏమిచేస్తుంది —td 35ఎ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: వేరుపారినవారై విశ్వాసమందు స్థిరంగా ఉండండి.—కొలొ. 2:6, 7.
20 నిమి: “మనం బోధించేవాళ్ల హృదయాన్ని దేవుని మాట వినేలా కదిలించాలంటే ఏం చేయాలి?” ప్రశ్నాజవాబులు. రెండు భిన్నమైన ప్రదర్శనలు చేయించండి. పిల్లవాడు చనిపోయి, ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడని ఇంటామె చెప్తుంది. మొదటి ప్రదర్శనలో, ప్రచారకురాలు ఆమెకు ప్రసంగి 9:5 చూపించి, చనిపోయినవాళ్లు ఎక్కడున్నారో చెప్తుంది. ఇంటామె ఓదార్పు పొందదు, ఆమె దానికి ఒప్పుకోదు. రెండవ ప్రదర్శనలో, ప్రచారకురాలు నేర్పుగా యోహాను 5:28, 29లో ఉన్న పునరుత్థాన నిరీక్షణ గురించి ఇంటామెకు చెప్తుంది. అప్పుడు ఇంటామె చక్కగా వింటుంది.
10 నిమి: మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచండి. (1 తిమో. 4:11-16) కావలికోట, డిసెంబరు 15, 2009, 12 నుండి 15 పేజీల్లో, 8 నుండి 17 పేరాల ఆధారంగా చర్చ. వాళ్లు ఏ పాఠాలు నేర్చుకున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 4, ప్రార్థన