మన ప్రచురణలకు మీరు విలువిస్తున్నారా?
1 యెహోవా, యేసుక్రీస్తు గురించిన జ్ఞానం చాలా విలువైనది. ఆధ్యాత్మిక సత్యాలను దేవుని జ్ఞానంతో లోతుగా వివరించేవి కేవలం మన ప్రచురణలే. (రోమా. 11:33; ఫిలి. 3:8) మన ప్రచురణలను విలువైనవిగా ఎలా చూడవచ్చు?
2 రాజ్యమందిరంలో “ప్రపంచవ్యాప్త పనికోసం” అనే పెట్టెలో వేయడానికి చాలామంది ఒక్కొక్కరిగా లేదా కుటుంబమంతా కలిసి క్రమంతప్పకుండా కొంత డబ్బును పక్కనపెడతారు. పరిచర్య చేసేటప్పుడు మన ప్రచురణలను ఎవరికి ఇస్తున్నాము అనే విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా వాటికి విలువనిస్తాం. ఇంటివాళ్లకు ఆసక్తి ఉందా? మనం చెప్పేవి వింటున్నారా, మనం అడిగే ప్రశ్నలకు జవాబిస్తున్నారా, మనం బైబిలు నుండి చదువుతున్నప్పుడు వాళ్లు కూడా చూస్తున్నారా? ఇలా ఆసక్తి చూపించిన వాళ్లకు కావాల్సిన ప్రచురణను సంతోషంగా ఇస్తాం. ఎందుకంటే ప్రచురణలను చదివితేనే వాటివల్ల అసలు ప్రయోజనం ఉంటుంది.
3 రాజ్యమందిరంలో గానీ మన ఇంట్లో గానీ ప్రచురణలు ఉండిపోవడంవల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పత్రికలు, బ్రోషుర్లు, పుస్తకాలు, కరపత్రాలు పాతవైనా వాటిని ఉపయోగించాలి. మన దగ్గరున్న ప్రచురణలు పాడవ్వకుండా, చిరిగిపోకుండా, తడిచిపోకుండా మంచి స్థితిలో ఉన్నాయా? అయితే వాటిని పరిచర్యలో ఇచ్చేయడానికి పూర్తిగా ప్రయత్నించాలి. పాడైపోయిన వాటిని మనమే ఉపయోగించవచ్చు లేదా తీసేయవచ్చు. నెలలో ఇవ్వాల్సిన వాటితోపాటు అప్పుడప్పుడు వేరే ప్రచురణలు కూడా ఉపయోగించవచ్చు.
4 పరిచర్యలో ఇవ్వడానికి మీకు ఎన్ని ప్రచురణలు అవసరమో జాగ్రత్తగా ఆలోచించండి. మీ దగ్గర మరీ ఎక్కువ సంఖ్యలో ప్రచురణలను ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజ్య మందిరంలో మీటింగ్స్కు ముందు తర్వాత ప్రచురణలు తీసుకోవచ్చు. వారం మొదలైనప్పుడు మీకు అవసరమైనన్ని ప్రచురణలే తీసుకోండి, అవి అయిపోగానే మళ్లీ తీసుకోవచ్చు.
5 మన ప్రాంతంలో చాలామందికి వచ్చే ప్రశ్నలకు జవాబులు మన కరపత్రాలు ఇస్తున్నాయి. వాటిని చదవడానికి త్వరగా ఇష్టపడతారు. బహిరంగ సాక్ష్యంలో, ఇంటింటి పరిచర్యలో కరపత్రాలు, పత్రికలు, బ్రోషుర్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. బహిరంగ సాక్ష్యం చేసేటప్పుడు కరపత్రాలు, బ్రోషుర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్లను కూడా ఉపయోగించండి. మంచివార్త! బ్రోషుర్ లేదా ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం. . . బ్రోషుర్ను ఇచ్చి బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. వాళ్లకు నిజంగా ఆసక్తి ఉంది, పుస్తకం ఇస్తే తప్పకుండా చదువుతారని అనిపిస్తేనే బైబిలు బోధిస్తోంది లేదా వేరే పుస్తకం ఇవ్వండి. ఇంటివాళ్లకు నిజంగా చాలా ఆసక్తి ఉందని మీకనిపిస్తే మొదటిసారి కలిసినప్పుడే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వండి. వీలైన ప్రతీచోట, ప్రింట్ అయిన ప్రచురణలకు బదులు jw.org వెబ్సైట్లో ఉన్న వాటి ఎలక్ట్రానిక్ కాపీలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
6 మనకు ఇస్తున్న ప్రచురణలను జాగ్రత్తగా, వివేచనతో ఉపయోగిస్తూ వాటికున్న విలువను కాపాడుదాం.