దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఆగస్టు 31, 2015తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
యెహోవా దేవుని గురించి విశ్వాసాన్ని బలపర్చే సత్యాలు సొలొమోను ప్రార్థనలో ఏమేమి ఉన్నాయి? ఆ సత్యాల గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం? (1 రాజు. 8:22-24, 28) [జూలై 6, w05 7/1 30వ పేజీ, 4వ పేరా]
‘యథార్థ హృదయుడై నడుచుకున్న’ దావీదును మనమెలా అనుసరించవచ్చు? (1 రాజు. 9:4) [జూలై 13, w12 11/15 7వ పేజీ, 18-19 పేరాలు]
యెహోవా, సారెపతులోని విధవరాలు దగ్గరకు ఏలీయాను పంపించడాన్ని బట్టి మనం ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు? (1 రాజు. 17:8-15) [జూలై 27, w14 2/15 14వ పేజీ]
1 రాజులు 17:10-16లో ఉన్న వివరాలను ధ్యానించడం వల్ల యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచాలనే మన నిర్ణయం ఎలా బలపడుతుంది? [జూలై 27, w14 2/15 13-15 పేజీలు]
బాధలో కృంగిపోయినప్పుడు ఏలీయా ఉంచిన మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 రాజు. 19:4) [ఆగ. 3, ia 117-118 పేజీలు, 10-12 పేరాలు; w14 3/15 15వ పేజీ, 15-16 పేరాలు]
కృంగిపోయిన ఏలీయాను చూసి యెహోవా ఎలా స్పందించాడు? మనం కూడా మన ప్రేమగల దేవున్ని ఎలా అనుసరించవచ్చు? (1 రాజు. 19:7, 8) [ఆగ. 3, w14 6/15 27వ పేజీ, 15-16 పేరాలు]
అహాబు రాజుకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం ఉంది? క్రైస్తవులుగా నేడు మనం అలాంటి తప్పు చేయకుండా ఎలా ఉండవచ్చు? [ఆగ. 10, lv 188-189 పేజీల్లోని బాక్సు]
‘నీ ఆత్మలో రెండు పాళ్లు’ ఇవ్వమని ఏలీయాను అడిగిన ఎలీషా నుండి మనమేమి నేర్చుకోవచ్చు? రాజ్యసేవలో ఏదైనా కొత్త నియామకం పొందినప్పుడు అది మనకెలా సహాయం చేస్తుంది? (2 రాజు. 2:9, 10) [ఆగ. 17, w03 11/1 31వ పేజీ, 5-6 పేరాలు]
2 రాజులు 5:1-3లో ఉన్న ఇశ్రాయేలు బాలిక చూపించిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని నేటి యౌవనులు ఎలా చూపించవచ్చు? [ఆగ 24, w12 2/15 12-13 పేజీలు, 11వ పేరా]
అంతానికి దగ్గర్లో జీవిస్తున్న యెహోవా సేవకులందరం యెహులోని ఎలాంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషిచేయాలి? (2 రాజు. 10:16) [ఆగ. 31, w11 11/15 5వ పేజీ, 4వ పేరా]