మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లు
1. సువార్తికులు ఏ విధంగా ఒక శిల్పిలాంటి వాళ్లు?
1 శిల్పులు రకరకాల పనిముట్లు వాడతారు. కొన్ని పనిముట్లను ప్రత్యేకమైన పనులకే వాడతారు కానీ కొన్నిటిని ఎక్కువగా వాడతారు. ఈ పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఆ పనిముట్లను ఎప్పుడూ వాళ్లదగ్గర పెట్టుకుంటారు. వాటిని చాలా నైపుణ్యంగా ఉపయోగిస్తారు. ఒక క్రైస్తవుడు పరిచర్యలో “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండాలని బైబిలు చెప్తుంది. (2 తిమో. 2:15) మనం ఎక్కువగా వాడే పనిముట్టు ఏంటి? దేవుని వాక్యం. “శిష్యులను” చేయడానికి మనం ఎక్కువగా ఉపయోగించేది దీనినే. (మత్త. 28:19, 20) కాబట్టి ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ మనం బాగా ప్రయత్నించాలి. అయితే దేవుని వాక్యంతో పాటు మనం వేరే పనిముట్లను కూడా తరచూ ఉపయోగిస్తాం. ప్రతీ క్రైస్తవుడు ప్రజలకు సత్యం నేర్పించడానికి వాటిని చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి.—సామె. 22:29.
2. మనం పరిచర్యలో ఎక్కువగా వాడే పనిముట్లు ఏంటి?
2 మనం ఎక్కువగా వాడే పనిముట్లు: బైబిలుతోపాటు మనం ఇంకా వేటిని ఉపయోగించాలి? బైబిలు సత్యాలను నేర్పించడానికి మనం ఎక్కువగా వాడే పనిముట్టు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. ఆ పుస్తకం పూర్తయ్యాక, బైబిలు సూత్రాలను ప్రతిరోజు జీవితంలో పాటించడం నేర్పించడానికి ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకం వాడతాం. కాబట్టి ఈ రెండు పుస్తకాలను నైపుణ్యంగా ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. మనం వాడే పనిముట్లలో కొన్ని బ్రోషుర్లు కూడా ఉన్నాయి. మనం బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి ఎక్కువగా ఉపయోగించే బ్రోషురు దేవుడు చెబుతున్న మంచివార్త! ఇంటివాళ్లు క్రైస్తవులు కాకపోతే దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్ పరిచయం చేసే ముందు ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . బ్రోషుర్ ఇవ్వవచ్చు. మన ప్రాంతంలో, తక్కువ చదువుకున్నవాళ్లు ఉంటే లేదా వేరే భాష వాళ్లు ఉండి ఆ భాషలో మన ప్రచురణలు ఎక్కువగా లేకపోతే దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లు వాడవచ్చు. విద్యార్థులను సంస్థలోకి తీసుకురావడానికి ఎక్కువగా ఉపయోగపడే పనిముట్టు నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? బ్రోషురు. బైబిలు ఎందుకు చదవాలి? రాజ్యమందిరం అంటే ఏమిటి? దేవునికి పేరుందా? లాంటి వీడియోలు కూడా శిష్యులను చేయడానికి బాగా ఉపయోగపడతాయి. వాటిని కూడా చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి.
3. రాబోయే మన రాజ్య పరిచర్యలు మనకు ఏ విషయంలో సహాయం చేస్తాయి?
3 మన పనిముట్లను చక్కగా ఉపయోగించడానికి సహాయం చేసే ఆర్టికల్స్ రాబోయే మన రాజ్య పరిచర్యల్లో వస్తాయి. మన దగ్గరున్న పనిముట్లను నైపుణ్యంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే మనం ఈ సలహాను పాటించినట్లే: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమో. 4:16.